ఇదేం టాలెంట్ అయ్యా బాబు.. చీరతో క్షణాల్లోనే తాళ్లు తయారు.. వీడియో వైరల్!

ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు వస్తువులను వాడి పారేస్తున్నారు.ఈ వస్తువుల వ్యర్ధాలు భూమిలో కలిసిపోతూ పర్యావరణానికి చాలా పెద్ద ముప్పును తలపడుతున్నాయి.

అయితే కొందరు మాత్రం ఏ వస్తువును కూడా పారేయడం లేదు.వాటిని రీసైకిల్ చేసి స్వప్రయోజనం పొందడంతో పాటు పర్యావరణానికి మంచి చేస్తున్నారు.

ఇందులో భాగంగా కొందరు వ్యక్తులు పాత చీరలను రీసైక్లింగ్ చేస్తూ తాళ్లను రూపొందిస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియోని ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహు ట్విటర్ లో షేర్ చేశారు.

క్షణాల్లోనే వైరల్ గా మారిన ఈ వీడియోకి ఇప్పటికే 60 వేల వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక బ్లూ కలర్ చీరను చాలా వేగంగా కట్ చేయడం చూడొచ్చు.

అనంతరం వీరు మోటార్‌సైకిల్ కి అమర్చిన ఒక మిషన్ సహాయంతో ఆ చీరను తాళ్లుగా మారుస్తున్నారు.

తాడులుగా మార్చుతున్న ఈ పాత దుస్తులను వివిధ ప్రయోజనాల కోసం ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

ఇలా ఈ వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు.“వస్త్రాల రీసైక్లింగ్ కోసం ఇది అద్భుతమైన దేశీ ఆవిష్కరణ.

మన చుట్టూ చాలా లోకల్ టాలెంట్ ఉంది. """/"/ మనం చేయాల్సిందల్లా ఈ ఎకో-యోధులకు మద్దతు ఇవ్వడం, ప్రోత్సహించడం.

" అని సుప్రియ ఈ వీడియో కి ఒక క్యాప్షన్ జోడించారు.మనం ప్రతిరోజూ సృష్టించే వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించడానికి ఇలాంటి రీసైక్లింగ్ పద్ధతులు ఉపయోగపడతాయి.

వస్తువులను పారేయడానికి ముందు వాటిని వీలైనన్ని సార్లు తిరిగి ఉపయోగించాలి.రీసైకిల్ చేస్తూ వస్తువులను వేరే విధంగా ఉపయోగించాలి.

ప్రస్తుతం ఈ వర్కర్లు కూడా అదే చేస్తున్నారు.దీంతో ఐఎఎస్ అధికారితోపాటు నెటిజన్లు కూడా వీరిని పొగుడుతున్నారు.

ఇది బ్రిలియంట్ టాలెంట్ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

చిరంజీవి కంటే స్టార్ హీరో విజయ్ బెస్ట్ అంటున్న కీర్తి సురేష్.. మీకేం తెలుసంటూ?