Turkish Coffee While Cycling : ఇదేం టాలెంట్.. సైకిల్‌ తొక్కుతూనే కాఫీ తయారు చేసిన వ్యక్తి వీడియో వైరల్..

ఇటీవల కాలంలో కదులుతున్న వాహనాల్లో వంటలు చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది.ఇప్పటికే కారు ఓనర్లు ట్రావెలింగ్( Travelling ) సమయంలోనే రకరకాల వంటకాలు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అవి బాగా వైరల్ అయ్యాయి.అయితే వీటన్నిటికీ మించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ లో ప్రత్యక్షమైంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్ పైనే కాఫీ తయారు చేశాడు.అదేదో ఆగి ఉన్న సైకిల్ కాదు, దాన్ని తొక్కుతూనే ఇతగాడు టేస్టీ కాఫీ ప్రిపేర్ చేశాడు.

అతను ప్రిపేర్ చేసింది ఒక టర్కిష్ కాఫీ( Turkish Coffee ) అట.

వెళ్తున్న సైకిల్ హ్యాండిల్ పై వుడెన్ ప్లాంక్ ఉంచి హాట్ డ్రింక్ తయారు చేసిన సదరు టాలెంటెడ్ పర్సన్ పేరు దావూద్ నూరి, అతను టీ కూడా అమ్ముతుంటాడు.

వీడియోలో తన సైకిల్ తొక్కుతూ కాఫీ చేస్తూ కనిపించాడు.ఇంటి వద్ద చేసిన కాఫీ కంటే ఇలా మార్గం మధ్యలో చేసే కాఫీయే కస్టమర్లకు వేడిగా, తాజాగా ఉంటుందని అతడు అంటున్నాడు.

"""/"/ చాలా మంది ఈ వీడియో( Viral Video )ను, అతని కాఫీ చేసే విధానాన్ని ఇష్టపడ్డారు.

ఈ క్లిప్‌కు 3 లక్షల దాక లైక్‌లు వచ్చాయి.అతని నైపుణ్యం, వేగం చూసి ఆశ్చర్యపోయామని కొందరు చెప్పారు.

తాము చూసిన వీడియోల్లో ఇది బెస్ట్ అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.

కాఫీని ఇష్టపడే కొందరు వీడియోను లైక్ చేసినట్లు తెలిపారు.ఆ కాఫీని టేస్ట్ చేయాలని ఉందని మరొకరు వ్యాఖ్యనించారు.

"""/"/ నూరి, అతని భార్య తమ బైక్‌తో వివిధ దేశాలకు కూడా వెళతారు.

వీధుల్లో కాఫీ, టీలను విక్రయిస్తారు.సైకిల్‌పై కాఫీ( Turkish Coffee While Cycling ) తయారు చేసే వ్యక్తి మరొకరు కూడా ఉన్నారు.

అతని పేరు ఎనెస్ సెఫా, అతను టర్కీలోని బుర్సా అనే నగరంలో నివసిస్తున్నాడు.

ఒకప్పుడు ఇస్తాంబుల్‌లో విమానాలలో పనిచేసేవాడు, కానీ ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి 2020లో తిరిగి బర్సాకు వచ్చాడు.

పాత సైకిల్‌ను స్నేహితుడితో సరి చేయించి కాఫీ షాప్‌గా మార్చాడు.