వైరల్ వీడియో: డాక్టర్ చూస్తుండగాన్నే హార్ట్ ఎటాక్ తో చనిపోయిన వ్యక్తి..
TeluguStop.com
ప్రస్తుతం ఉన్న అనారోగ్యాల దృష్ట్యా ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలు చాలానే ఉన్నాయి.
ఈ క్షణాన బతికున్నవారు మరో క్షణానికి బతికి ఉంటారో లేదో అన్న గ్యారెంటీ కూడా లేకపోతే పోయింది.
అందుకు గల కారణం ప్రస్తుత రోజులలో ఉండే అనారోగ్య సమస్యలు అనే చెప్పాలి.
అచ్చం అలాంటి సంఘటననే ఒకటి ఇండోర్ లో చోటుచేసుకుంది.అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఒక వ్యక్తి డాక్టర్ వైద్య పరీక్షలుచేస్తుండగానే.
ఒకసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలను కోల్పోయాడు. """/" /
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఇండోర్( Indore ) లో శివాజీ నగర్ కు చెందిన సోను మట్కర్ తాజాగా ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళాడు.
ఈ క్రమంలో డాక్టర్ కి ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉండగా డాక్టర్ వైద్య పరీక్షలో నిర్వహిస్తుండగా సోను ఒక్కసారిగా కూర్చున్న కుర్చి లోపేలే కుప్ప కోల్పోయాడు.
వెంటనే అతడిని ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యాధికారులు తెలియజేశారు.
వాస్తవానికి సోనికి గుండె పోటు( Heart Attack ) వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
"""/" /
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
అయితే మృతుడు సోనుకి ముగ్గురు కుమారులు ఉన్నారని, సోను కూడా ఎల్ఐసి లో పనిచేసేవాడని అతని సోదరుడు గణేష్ తెలియజేశాడు.
అయితే గత ఐదు నెలల క్రితం సోను అతని అధికారులు విధుల నుంచి ఏ కారణం లేకుండా తీసివేయడంతో అతడు తీవ్ర మనోవేదనకు గురి అయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తీవ్రంగా ఆలోచించి గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు తెలుస్తుంది.ఉన్నత అధికారులు తనకు అన్యాయం చేశారని సోను ఎప్పుడు కూడా తన స్నేహితులతో చెప్పేవాడని, ఇక ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టేశారు పోలీస్ అధికారులు.
శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?