వైరల్ వీడియో: కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్‌లో సందడి చేసిన రియల్ హీరో..

కుమారి ఆంటీ( Kumari Aunty ).రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు.

హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ ( Madapur In Hyderabad City )ప్రాంతంలో రోడ్డు సైడ్ ఉన్న ఫుడ్ వ్యాపారం చేసుకుని జీవించే ఈవిడ సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్.

ఈమెపై వచ్చిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.అందులో ముఖ్యంగా.

" మీది మొత్తం 1000 అయింది 2 లివర్స్ ఎక్స్ట్రా " అనే డైలాగ్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో ఉన్న అన్ని సామాజిక మాధ్యమాలలో ఈవిడ ఫుడ్ స్టాల్ సంబంధించిన వీడియోలు ఎంతో ఫేమస్ అయ్యాయి.

దీంతో ఇంకేముంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఆలస్యం లేదు ప్రజలు అటువైపు పరుగులు పెడతారు.

దాంతో కుమారి అండి ఫుడ్ స్టాల్కు జనాలు పోటెత్తారు.ఒకానొక సమయంలో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య కారణంగా ఏకంగా ఆమె స్టాండ్ ను ఎత్తేసేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు.

అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి చొరవ తీసుకొని మళ్ళీ ఆమె ఫుడ్ స్టాల్ ను ఏర్పాటు చేసుకునేందుకు సహకరించారు.

"""/" / ఇకపోతే తాజాగా రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ ( Sonusood )సైతం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను ఆకస్మితంగా సందర్శించాడు.

సోను సూద్ కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చి సడన్ సప్రైజ్ ఇవ్వడంతో కుమారి ఆంటీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సోను సూద్ అక్కడికి చేరుకోవడంతో ఆయన ఫ్యాన్స్ భారీగా అక్కడికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో సోను సైతం వారితో సందడి చేస్తూ మాట్లాడాడు.

అంతేకాదు కుమారి ఆంటీకి శాలువాను కప్పి పూలగుచ్చం ఇచ్చి సత్కరించాడు.అంతేకాదు ఆమెతో కొద్దిసేపు సరదాగా మాట్లాడుతూ పంచులు వేస్తూ అందరిని నవ్వించాడు.

అక్కడ ఫుడ్ తినేవారికి కూడా సోను సూద్ ఫోటో సైతం సర్వ్ చేశాడు.

"""/" / ఈ సందర్భంగా కుమారి ఆంటీ పై సోనూసూద్ ప్రశంసల వర్షం కురిపించాడు.

మహిళా సాధికారతకు కుమారి ఆంటీ బెస్ట్ ఉదాహరణ అంటూ ఆమెను కొనియాడాడు.ఆమెకు భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైన తాను చేస్తానని ఆమెకు భరోసా ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?