సింహంపై ఎదురుదాడి చేసిన అడవి దున్న.. వైరల్ వీడియో
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు, జంతువుల మధ్య జరిగే బికిర పోరులకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
సాధారణంగా అడవిలో అనేక జంతువులు( Animals ) నివసిస్తూ ఉంటాయి.ఒక జంతువు అడవిలో జీవనం కొనసాగించాలి అంటే మరో జంతువు చావాల్సిందే అన్నట్టు ఉంటుంది.
ఈ క్రమంలో సింహం( Lion ) వేటకు బయలుదేరిన సమయంలో దారిన ఏ జంతువు కనపడితే ఆ జంతువులు వేటాడి మరి ప్రాణాల సైతం తీసేస్తుంది.
అయితే, తాజాగా ఈ క్రమంలో ఒక సింహానికి అనుకోని సంఘటన చోటుచేసుకుంది.ఇందుకు సంబంధిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
"""/" /
అడవి దున్నను( Wild Buffalo ) వేటాడే క్రమంలో సింహానికి పెద్ద చిక్కే ఎదురయ్యింది.
అనుకోని విధంగా అడవి దున్న సింహంపై ఎదురుదాడికి దిగడంతో సింహం కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా సింహం ఒంటరిగా ఉన్న అడవి దున్న మెడను గట్టిగా నోటితో పట్టుకుందామని ట్రై చేయగా.
కానీ, అడవి దున్న సింహానికి ఆ అవకాశం ఇవ్వకుండా చురుకుగా వ్యవహరిస్తూ తన దృఢమైన కొమ్ములతో సింహాన్ని పొడిచే ప్రయత్నం చేసింది.
"""/" /
ఈ క్రమంలో సింహం కూడా బలవంతంగా లొంగదీయాలని ట్రై చేసినా కానీ పట్టు విడవకుండా అడవి దున్న సింహం పై పోరాటం కొనసాగించింది.
దీంతో సింహం దాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేసేసింది.ఇక అడవి దున్న సింహం పోరాటానికి సంబంధించిన వీడియో నెటిజన్స్ చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
కొందరు సింహాలను సైతం ఓడించే శక్తి అడవి దున్నలకు ఉంది అంటే ఇదే అనుకుంటా అని కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరు, "వేటాడే రాజునే వేటాడడం సరికొత్తగా ఉంది" అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది… రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!