వైరల్ వీడియో: తన ఫ్లిప్ ఆర్ట్ తో అదరగొట్టిన బుడ్డోడు..!

కెజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు యశ్.

అప్పటి వరకు కేవలం కన్నడ వరకు మాత్రమే తెలిసిన యశ్, కెజియఫ్ సినిమాతో ఇండియా మొత్తం గర్వించదగ్గ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.

ఒకే సినిమాతో తన మార్కెట్ అమాంతం పెంచుకున్నాడు ఈయన.కేజీఎఫ్ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మొదటి పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీగా గుర్తింపు లభించింది.

రాకింగ్ స్టార్ హీరో యశ్ ఈ సినిమాతో అన్ని ఇండస్ట్రీలో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నాడు.

"""/"/ ఇండస్ట్రీలలో కూడా కెజియఫ్ ఛాప్టర్ 2 పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

ఇప్పుడు యశ్ కూడా ఇదే చేస్తున్నాడు.అయితే కెజియఫ్ లాంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత ఈయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు క్యూలో ఉన్నారు.

ఇక కేజీఎఫ్ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా ఇదే.

అన్ని ఇండస్ట్రీలలో అదిరిపోయే బిజినెస్ చేస్తుంది కేజీఎఫ్ 2.ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయ్యి సంచనాలను సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా ఒక చిన్నారి అభిమాని ఈ టీజర్ ‌ను ఫ్లిప్‌ ఆర్ట్‌ రూపంలో 100 భాగాలుగా చేసి ఆశ్చర్యపరిచాడు.

వీటిని సూర్య ఫ్యాన్స్‌ తరఫున హీరో యష్‌ ను ట్యాగ్‌ చేస్తూ కొందరు ట్విటర్ ‌లో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోపై కేజీఎఫ్ ‌ చిత్ర నిర్మాత కార్తీక్ ‌గౌడ అద్బుతంగా ఉందంటూ మెచ్చుకున్నారు.

బార్లీతో అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్‌..!