వైరల్ వీడియో: సరిహద్దుల్లో చిందులేస్తున్న జవాన్లు.. సూపర్ వీడియో!
TeluguStop.com
దేశ సరిహద్దుల దగ్గర భారత జవాన్లు ఎంత అంకితభావటంతో కాపుగాస్తారో అందరికీ తెలిసిందే.
పగలు, రేయి, ఎండా, వానా, చలి అనే బేధమేమీ లేకుండా వారి విధులను నిర్వర్తిస్తుంటారు.
దేశ రక్షణలో విధిగా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అర్పిస్తారు.అయితే, నిత్యం రక్షణ బాధ్యతలతో బిజీగా ఉండే సైనికులు, వీలు చిక్కినప్పుడల్లా కాస్త రిలాక్స్ అవుతుంటారు.
అలాంటి సమయాలలో తోటి జవాన్లతో సరదాగా ఆటలు ఆడటం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుంటారు.
అయితే, తాజాగా ITBP అధికారిక ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు.ఆ వీడియోకు భారతీయులందరూ ఫిదా అయిపోతున్నారు.
విషయమేమిటంటే, ఇండో-టిబెటన్ బోర్డర్ భద్రతా సిబ్బంది చిన్నపిల్లల్లా మారిపోయారు.మంచు దిబ్బల్లో సరదాగా కాసేపు ఆడుకున్నారు.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు గుర్తుచేసుకుంటూ, చిన్నపిల్లల్లాగా మారిపోయి సంతోషంగా గడిపారు.చిన్నతనంలో ఆడుకునే కోకో లాంటి ఆటను ఆడటం మనం ఆ వీడియోలో గమనించవచ్చు.
హిమాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దుల్లో హిమాలయ పర్వతాల మంచులో చలి తీవ్రత తట్టుకునేందుకు వీలుగా తెల్లని దుస్తులు ధరించిన జవాన్లు.
రౌండ్‌గా కూర్చోవడం మనం స్పష్టంగా చూడవచ్చు. """/"/
వీరిలో ఒక వ్యక్తి వరుసగా కూర్చున్న వారి వెనుక పరుగెడుతూ, అందులో ఒకరిని తన చేతితో ముట్టడం ద్వారా, ఏ వ్యక్తిని అయితే సదరు వ్యక్తి ముడతాడో.
ఆ వ్యక్తి మరలా వారి చుట్టూ తిరుగుతూ ఇంకొకరిని పట్టుకుంటాడు.ఈ గేమ్‌ను జవాన్లు చాలా ఉత్సాహంగా ఆడారు.
జవాన్ల సరదా ఆటకు సంబంధించిన వీడియోను ITBP అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు అధికారులు.
దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.జవాన్ల ఆటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
కాగా, ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
వయసు పెరిగిన బుద్ది పెరగలేదు.. గుడిలో ఆ నీచం పనులేంటో!