వైరల్ వీడియో: ఇదేందయ్యా ఇది.. కారు దానంతట అదే..?!

సోషల్ మీడియా వచ్చాక రకరకాల వీడియోలు మనకు దర్శనం ఇస్తున్నాయి.ఎన్నో రకాల వింతలు, విశేషాలు, అద్భుతాలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాము.

అలా చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఒక మిస్టరీ లాంటి కార్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది.

అదృష్టం వంతుడిని ఎవరు చెడగొట్టలేరు అలాగే దురదృష్ట వంతుడిని ఎవ్వరు బాగు చెయ్యలేరు.

అనే సామెత మన అందరికి గుర్తు ఉండే ఉంటుంది.అలాంటి వీడియోనే ఇది.

ఏదో ఒక ప్రమాదంలో కారు ఒక పక్కకు దొర్లి పోయింది.దానిని నానా తిప్పలు పడి ఒక క్రేన్ సహాయంతో పైకి లేపారు.

అక్కడి వరకు అంతా బాగానే ఉంది.తరువాతనే అసలు ట్విస్ట్ మొదలయింది.

అదేంటో మరి కార్ లో ఎవరో ఉన్నట్టు దానంతట అదే వెళ్లి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది.

దీనినే అంటారు మునిగే నక్క మీద తాటికాయ పడడం అంటే కార్ పక్కకు దొర్లినప్పుడు అయిన డామేజ్ కంటే లోయలో పడినప్పుడు అయిన డామేజ్ ఎక్కువగా ఉందన్నమాట.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఒకసారి వీడియోను పరిశీలిస్తే రోడ్డు మీద ఒక కారు యాక్సిడెంట్ అయి పడిపోయినట్లుగా మనం వీడియోలో గమనించవచ్చు.

ఆ కారు ఓ పక్కకు పడిపోయి ఉంది. """/"/ అయితే నిజానికి ఈ కార్ ఎవరిది ఏంటి అనే వివరాలు తెలియదు.

రోడ్డు మీద అలా పడిపోయి ఉంది.కార్ తో పాటు మనుషులు ఎవ్వరు అక్కడ లేరు.

రోడ్డు మీద వచ్చే పోయే వాహనాలకు అడ్డుగా ఉంటుందని అధికారులు ఆ కార్ ను ఒక క్రేన్‌ ససహాయముతో తొలగించడం మనం వీడియోలో చూడవచ్చ క్రేన్ సహాయంతో పడి ఉన్న కారును మాములు స్థితికి తీసుకువచ్చారు.

కానీ కారు సడెన్ గా దానంతట అదే వెళ్లి లోయలో పడిపోయింది.ఆ కారు వెనుక ఒక వ్యక్తి కూడా పరుగులు పెట్టడం మనం వీడియోలో చూడవచ్చు.

ఒకవేళ కారులో ఎవరన్నా ఉన్నారా అంటే అది లేదు.ఆశ్చర్యంగా దానంతట అదే వెళ్లి లోయలో పడిపోయింది.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, మంగళవారం 2024