వైరల్ వీడియో: కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించి అద్భుతాన్ని సృష్టించిన ఇంజనీర్..!

ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఒక ఇంజనీర్ నిర్మించిన బ్రిడ్జి మీద పడింది.

ఒక సరికొత్త ఆలోచనతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన కొత్త పంబన్ బ్రిడ్జిని తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ పంబన్ బ్రిడ్జి నిర్మాణం అనేది మన ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన పనితనానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.

దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడ ఈ సరికొత్త పంబన్ బ్రిడ్జి గురించే చర్చిస్తున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ గా మారాయి.

ఈ బ్రిడ్జికి సంబందించిన పనులను రైల్వే మినిస్ట్రీ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు తరచూగా షేర్ చేస్తూ వస్తుంది.

ఈ క్రమంలోనే బ్రిడ్జికి సంబంధించిన ఒక సరికొత్త వీడియోని ట్విట్టర్ లో షేర్ చేయడం జరిగింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

ఈ బ్రిడ్జి యొక్క చరిత్ర విషయానికి వస్తే.ఇది బంగాళాఖాతంలోని పాంబన్ ద్వీపాన్ని, భారతదేశ ప్రధాన భూభాగాన్ని పాత పాంబన్ బ్రిడ్జ్ కలుపుతుంది.

నిజానికి ఈ బ్రిడ్జి కొన్ని వంద సంవత్సరాల క్రితం నిర్మించబడింది కావున ఈ బ్రిడ్జి ఇప్పుడు బాగా పాతబడిపోయింది.

అందుకే పాత బ్రిడ్జి స్థానంలో కొత్త పాంబన్ బ్రిడ్జిని నిర్మించాలని 2019లోనె రైల్వేశాఖ అనుకుంది ఇందుకోసం కోసం దాదాపు రూ.

280 కోట్లను కూడా రైల్వే శాఖ కేటాయించింది.బ్రిడ్జి నిర్మాణంలో భాగంగానే తమిళనాడు రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పంబన్ బ్రిడ్జి నిర్మాణం.

చేపట్టింది.ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పంబన్ బ్రిడ్జి అనేది ఆల్ట్రా మోడ్రన్ డ్యూయల్-ట్రాక్ బ్రిడ్జి భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా నిర్మించబడుతుంది.

"""/" / రామేశ్వరం, ధనుష్కోడికి ఆధ్యాత్మిక యాత్రను చేయాలనుకునే యాత్రికులు, భక్తులకు ఈ కొత్త బ్రిడ్జి ఒక మార్గాన్ని చూపిస్తుందనే చెప్పొచ్చు.

ఈసారి కొత్త పంబన్ బ్రిడ్జిని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది.

ఇప్పుడు ఉన్న ఓల్డ్ పంబన్ రైల్వే బ్రిడ్జికి పక్కనే ఈ కొత్త బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు.

2.07 కి.

మీ పొడవున ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది.అయితే ఈ బ్రిడ్జికి మరొ స్పెషాలిటీ కూడా ఉందండోయ్.

ఈ కొత్త పంబన్ బ్రిడ్జి యొక్క మధ్య భాగం పైకి కూడా లేస్తుందట.

అంటే ఓడలు లేదా స్టీమర్లు వెళ్లేందుకు ఈ స్పాన్‌ నిలువు దిశలో పైకి కిందకి కదిలేలాగా ఏర్పాటు చేశారట మరి కొన్ని రోజుల్లో ఈ వంతెన నిర్మాణం పూర్తి అవుతుందని తెలుస్తుంది.

ఓజీ సినిమా పోస్ట్ పోన్.. ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ సినిమా వాయిదా పడ్డట్టేనా?