వైరల్ వీడియో: ఈ పిల్లుల మధ్య స్నేహబంధం ఎంత అమోఘమో కదా..?!
TeluguStop.com
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక అవి చేసే చిలిపి పనులు నవ్వులు పూయిస్తుంటాయి.ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఎక్కడా ఏది కనపడినా వెంటనే వీడియో తీసి షేర్ చేస్తున్నారు.
క్షణాల్లోనే అవి నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సాధరణంగా రెండు పిల్లులు ఒక దగ్గర కలిస్తే ఏం జరుగుతుంది.ఇక వాటి మధ్య రెండో ప్రపంచ యుద్దం జరుగుతుంది.
గట్టిగా అరుస్తూఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి.మరీ అవే రెండు స్నేహితులుగా మారితే ఎలా ఉంటుంది.
అవును నిజమేనండి రెండు పిల్లులు ప్రాణ స్నేహితులుగా ఉండి ఆహారాన్ని షేర్ చేసుకుంటున్నారు.
ఎంతో పద్దతిగా తింటున్నాయి.ఒక ఇంట్లో పెంపుడు పిల్లులకు ఒకే గిన్నెలో ఆహారం పెట్టింది ఆ ఇంటి యజమాని.
అయితే అవి రెండు ఆహారం కోసం కోట్టుకోకుండా ఒకదానికి ఒకటి సహయం చేసుకుంటూ నెమ్మదిగా తింటున్నాయి.
ఒక పిల్లి కాస్తా ఆహారం తిన్న వెంటనేగిన్నెను మరో పిల్లి ముందుకు జరిపింది.
ఆ తర్వాత ఆ పిల్లి కూడా తాను ఆహారం తినగానే అది కూడా మళ్లీ ఆ గిన్నెను మొదటి ముందుకు జరిపింది.
ఇలా ఒకదానికోకటి అర్థం చేసుకోని నెమ్మదిగా ఆహారాన్ని తింటున్నాయి.ఈ వీడియోను Sh-ywild అనే యూజర్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ షేరింగ్ కేరింగ్ అంటూ క్యాప్షన్ పెట్టింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ రెండు పిల్లులు ఎలాంటి గొడవ పెట్టుకోకుండా పద్దతిగా తినడం చూస్తుంటే ముచ్చటేస్తుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.మరీ మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయ్యండి.
మామిడి తొక్కలతో ఇలా చేశారంటే చుండ్రు దెబ్బకు పరార్..!