వైరల్ వీడియో: ఇక్కడ కాఫీ, టీ గ్లాసులు కరకరా నమిలేసి తినొచ్చు..

ప్రపంచవ్యాప్తంగా కాఫీ, టీ లవర్స్ ఎందరో ఉన్నారు.అయితే వీరిని సాటిస్ఫై చేయడానికి కొత్త కొత్త రుచులతో చాలామంది కొత్త కొత్త టీలు, కాఫీలు తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉత్తర ఢిల్లీలోని రెసిడెన్షియల్ కాలనీ రోహిణిలోని శివచౌక్ వద్ద ఒకరు కొత్త టీ సెంటర్‌ను ప్రారంభించారు.

'ఇష్క్-ఎ-చాయ్' పేరుతో తోపుడు బండిపై ఈ టీ కాఫీ సెంటర్ ఏర్పాటు చేశారు.

ఇక్కడ సాధారణ కాఫీ, టీలతో మరో స్పెషల్ టీ దొరుకుతోంది.ఈ స్పెషల్ టీ తాగేటప్పుడు వాటి గ్లాసులను కరకర నమిలేసి హాయిగా తినొచ్చు.

వీటి గ్లాసుల రుచి కూడా అద్భుతంగా ఉంటుందట.ఈ తినదగిన కాఫీ, టీ తాగేందుకు చాలామంది ఈ సెంటర్ వద్దకు తరలివస్తున్నారు.

ఇంతకీ దీని వెనుక ఉన్న కథ ఏంటంటే.సాధారణంగా మనం కోన్‌ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసినప్పుడు.

ఆ ఐస్‌క్రీమ్ చుట్టూ ఒక హార్డ్ బిస్కెట్ కనిపిస్తుంది.ఐస్‌క్రీమ్‌తో సహా దీనిని మనం తినొచ్చు.

కాగా ఇదే బిస్కెట్‌లో టీ, కాఫీలు పోసి ఎందుకు ఇవ్వకూడదని ఇష్క్-ఎ-చాయ్ సెంటర్ యజమాని ఆలోచించాడు.

ఆ ఆలోచనను విజయవంతంగా ఆచరణలో పెట్టి చాలామందిని ఆకట్టుకుంటున్నాడు.అదే బిస్కెట్ పదార్థంతో ఐస్‌క్రీమ్‌ల కోన్‌ వలె కాకుండా గ్లాస్ రూపంలో అతను టీ, కాఫీ గ్లాసులు తయారు చేశాడు.

అనంతరం ఈ తినదగిన పదార్థంలో టీ, కాఫీలను పోసి ఇస్తున్నాడు. """/"/ వైరల్ అవుతున్న వీడియోలో అతడు బిస్కెట్ పదార్థంతో గ్లాసుగా తయారు చేసిన దానిలో టీ, కాఫీలు పోసి ఇవ్వడం మీరు గమనించవచ్చు.

ఆ తర్వాత సగం తినేసిన గ్లాసును కూడా మీరు వీక్షించవచ్చు.సన్నగా ఉంటే కాఫీ,టీ వేడికి ఈ గ్లాస్ కరిగిపోతుందనే ఉద్దేశంతో అతడు దీనిని చాలా మందంగా తయారు చేశాడు.

అందువల్ల ఈ తినదగిన గ్లాసుల్లో టీ పోసిన 20 నిమిషాల వరకు అధికారిగి పోకుండా ఉంటుంది.

అలా టీ తాగిన వెంటనే గ్లాస్‌ కాస్త మెత్తబడుతుంది.అప్పుడు దానిని కస్టమర్లు తినవచ్చు.

తినదగిన గ్లాసుల్లో టీ, కాఫీ కావాలనుకునేవారు ఆ గ్లాస్ పరిమాణాన్ని బట్టి రూ.

15 - రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ అద్భుతమైన ఆలోచన చేసిన వ్యక్తి పేరు రవికుమార్.ఇతను పాట్నాలో గ్రాడ్యుయేషన్ చేసి ఈ వ్యాపారంలో అడుగుపెట్టాడు.