వైరల్ వీడియో: టెన్నిస్ బాల్స్ ఎలా తయారు చేస్తారో చూశారా..
TeluguStop.com
టెన్నిస్ బాల్స్( Tennis Balls ) గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.
టెన్నిస్ స్పోర్ట్స్ ఆడటానికి మాత్రమే కాకుండా దీనిని అనేక ఇతర ప్రయోజనాల కోసం కూడా వాడతారు.
ఉదాహరణకు కుక్కలు లేదా పిల్లులతో క్యాష్ అండ్ త్రో గేమ్ ఆడటానికి, నొప్పి కండరాలు లేదా ట్రిగ్గర్ పాయింట్లను మసాజ్ చేయడానికి, చేతిపనులు లేదా అలంకరణలను తయారు చేయడానికి వీటిని వినియోగిస్తారు.
అయితే మనుషుల జీవితాల్లో అంతర్భాగమైన ఈ బంతులు ఎలా తయారు చేస్తారో చాలామందికి తెలిసి ఉండదు.
తాజాగా ఈ బంతుల తయారీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా(Social Media )లో వైరల్ గా మారింది.
"""/" /
@gunsnrosesgirl3 ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
దాదాపు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో టెన్నిస్ బాల్స్ తయారీ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ నుంచి చివరి స్టెప్పు వరకు మనం చూడవచ్చు.
ఈ వీడియో క్లిప్ ప్రకారం, మొదట, రబ్బరు వేరే పదార్థాలతో మిక్స్ చేశారు, తర్వాత ఒక చపాతీ లాగా వాటిని ఫ్లాట్ చేశారు.
దానిని స్క్వేర్ షేప్ లో చిన్న ముక్కలుగా కట్ చేశారు. """/" /
అనంతరం ఇడ్లీ పాత్రలాగా గుంతలు ఉన్న ఒక ప్లేట్లో ఆ చిన్న మొక్కలను ఉంచారు.
దానిని క్లోజ్ చేసి ఒక ప్రెజర్ మెషిన్ లో పెట్టారు.అప్పుడు అవి ఒక హాఫ్ షెల్స్ వలే తయారయ్యాయి.
వాటిని మరింత షార్ప్ గా చేసి తర్వాత ఆ షెల్స్ ను ఒకదానికొకటి అతికించి మళ్లీ ఒక మెషిన్ లో ఉంచారు.
ఒత్తిడి ప్రవేశపెట్టిన తర్వాత వాటిని బయటికి తీసేసి గమ్ అతికించి పైన మెత్తటి తోలు స్టిక్ చేశారు.
ఆపై ఒక దారం కూడా అతికించారు.చివరికి బ్రాండ్ నేమ్ ముద్రించారు.
పవన్ ప్రాధాన్యం పెరుగుతోందిగా.. జమిలి ఎన్నికలొస్తే డబుల్ బెనిఫిట్