వైరల్ వీడియో : హార్ధిక్ పాండ్యా, న‌టాషా డ్యాన్స్ సూపర్..!

క్రికెట్ ఒకటే కాదు తనలో మరో కోణం వుందని తన ఫాన్స్ కు చూపించిన టీమిండియా ఆల్ రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా ఇటివల లాక్‌డౌన్ స‌మ‌యంలో హార్ధిక్ పాండ్యా, న‌టాషా స్టాన్ కోవిచ్‌ కు వివాహం జరిగిందన్న సంగ‌తి తెలిసిందే.

అంతేకాదు వీరికి అగ‌స్త్య అనే కుమారుడు ఉన్నాడు.నిజానికి హార్ధిక్ పాండ్యా సతిమణి న‌టాషా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా వుంటుంది.

అంతేకాదు తర‌చు త‌న ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా త‌న కుమారుడు అగ‌స్త్య‌తో భ‌ర్త హార్ధిక్ పాండ్యా, క‌లిసి చేసిన స్టైలిష్ డ్యాన్స్ వీడియోను నటాషా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.నటాషా సెర్బియాకు చెందిన నటి కాగా, నటాషా 2013లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సత్యాగ్రహ అనే చిత్రం, ప్రకాష్ ఝూ దర్శకత్వంలో నటించింది.

ఈ చిత్రంతో నటాషా తనదైన శైలిలో మంచి పేరును సంపాదించుకుంది.అంతేకాకుండా ఆమె ఫిలిప్స్‌, కాడ్‌బరీ, టెట్లీ, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటీ తదితర బ్రాండ్లకు పనిచేసింది.

ఇక టీవీ షోలో కూడా ఆమె కనబడటం మొదలుపెట్టింది.బిగ్‌బాస్‌ హిందీ ఎనిమిదవ సీజన్‌ లో (2014), నాచ్‌ బాలియే తొమ్మిదవ సీజన్‌ లో (2019) పాల్గొంది.

రాప్‌ సింగర్‌ బాద్షా 2014లో రూపొందించిన రెండు మ్యూజిక్‌ వీడియోల్లో నటాషా అందాలతో అదరగొట్టింది.

2014లో అరిమ నంబి అనే తమిళ సినిమా, 2016లో దానా కయోను అనే కన్నడ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి అదరగొట్టింది.

ది హాలిడే అనే వెబ్‌ సిరీస్‌లో నటించి హిందీ ప్రేక్షకులకు నటాషా మరింత దగ్గరైంది.

ప్ర‌స్తుతం ఇంగ్లండ్ సిరీస్‌ తో హార్ధిక్ పాండ్యా బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

తెలుగుదేశం పార్టీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్..!!