అయ్యయ్యో.. అలా పొగిడాడో లేడో.. ఇలా పడిపోయిన మహిళా బైకర్ (వీడియో)
TeluguStop.com
ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు అనేక మంది వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో పాటు రోడ్లపై చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.
అచ్చం అలాంటి సంఘటననే ఒకటే సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వీడియో ఆధారంగా ఒక యువతికి( Woman ) విచిత్ర అనుభవం ఎదురయింది.బైక్ లో( Bike ) వెళ్తుండగా తోటి బైకర్స్ ఆమెను పొగడ్తలతో ప్రశంసల వర్షం కురిపించాడు.
దీంతో చివరకు దారుణ ఘటన చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన విశేషాలు చూస్తే.
"""/" /
కొందరు బైకర్లు పర్యటన ప్రదేశంలో కొండలపై రైడ్ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ఒక యువతి కూడా బైక్ రైడ్ చేస్తుంది.కొండలలో వెళ్తున్న సమయంలో వారిలో యువతి ముందువైపు వెళుతుంటే వెనక వెళ్తున్న బైకర్స్ తమ రైడింగ్( Riding ) గురించి తన ఫాలోవర్ లకు వివరిస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో ఎంతో అందమైన ప్రదేశంలో బైక్ రైడ్ చేస్తే చాలు మంచి అనుభూతి కలుగుతుందని, అనంతరం తమ ముందు వెళ్తున్న యువతిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.
"""/" /
అయితే, అతను ఇలా పొగడ్తలు స్టార్ట్ చేయగానే సడన్ గా రోడ్డు మలుపు తిరిగే సమయంలో యువతి ప్రమాదవశాత్తు జారీ రోడ్డు పక్కన ఉన్న కొంత దూరం వరకు ఈడ్చుకొని వెళ్లిపోయింది బైక్ .
దీంతో వెనుక ఉన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.ఊహించని ఘటనతో వెంటనే వారు తమ బైకులను ఆపి మరీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మహిళను కాపాడారు.
ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమందిని నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ రోడ్డుపై మలుపులు తిరిగే క్రమంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.
దేవర ముంగిట నువ్వెంత.. థియేటర్లలో పుష్ప2 రిలీజవుతున్నా అక్కడ దేవర హవా!