స్టైల్‌గా బుల్లెట్ ఎక్క‌బోయింది.. కానీ బెడిసికొట్టిందే..!

పూర్వపు రోజుల్లో అమ్మాయిలను అసలు గడప దాటనిచ్చేవారే కాదు.కానీ నేడు రోజులు మారాయి.

మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.ఇదే సందర్భంలో బైకులు, కార్లు కూడా నడుపుతున్నారు.

అంతే కాకుండా విమానాలు నడిపి కూడా ఔరా అనిపిస్తున్నారు.కానీ కొన్ని సార్లు కొంత మంది చేసే అతి వల్ల నవ్వుల పాలవుతారు.

ఏదో చేద్దామని భావిస్తే మరేదో జరిగిపోతుంది.అలానే ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి రచ్చ లేపుతోంది.

ఇందులో కూడా ఓ అమ్మాయి స్టైల్ గా బుల్లెట్ బండి ఎక్కేందుకు ప్రయత్నించగా.

అది కాస్తా బెడిసి కొట్టి ఆమె నవ్వులపాలవుతుంది.ఇంతకీ ఏం జరిగిందంటే.

అమ్మాయిలు తమ బరువుకు స్కూటీలు తేలిగ్గా నడుపుతుంటారు.కానీ కొన్ని ద్విచక్రవాహనాలు మాత్రం విపరీతంగా బరువు ఉంటాయి.

అలాంటి వాటిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ముందు వరుసలో ఉంటుంది.నెట్టింట వైరల్ గా మారిన వీడియోలో ఓ అమ్మాయి స్కూటీ పైనుంచి దిగి బుల్లెట్ వైపు వస్తుంది.

ఆమె బుల్లెట్ నడిపి అందర్నీ ఆశ్చర్యపరచాలని అనుకుంటుంది.కానీ తానొకటి తలిస్తే.

దైవం మరోటి తలచిన మాదిరిగా ఆ అమ్మాయి పరిస్థితి మారిపోతుంది.బుల్లెట్ బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆ అమ్మాయికి బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అయి చివరకు కింద పడి నవ్వుల పాలవుతోంది.

ఇలా ఫన్నీగా ఉన్న ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

అది వైరల్ గా మారింది.ప్రస్తుతం ఈ వీడియోను పదివేల మంది నెటిజన్లు వీక్షించారు.

ఇంకా ఈ వీడియో దుమ్ము రేపుతూనే ఉంది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీ కామెంట్లు చేస్తూ.

వీడియోను షేర్ చేస్తున్నారు.

భారతీయ ముఠాల మధ్య ఆధిపత్య పోరు .. కెనడాలో ఇద్దరి హత్య, కోర్ట్ సంచలన తీర్పు