ఢిల్లీ వ్యాపారితో ఫారిన్ గర్ల్ బేరసారాలు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..

సాధారణంగా ఢిల్లీకి( Delhi ) చాలామంది విదేశీయులు వస్తుంటారు.భారతీయులు వస్తువుల ధరలను అధికంగా చెబుతారని విదేశీయులు బాగా అర్థం చేసుకున్నారు.

అందుకే వీరు ఇష్టానుసారం బేరసారాలు( Bargaining ) ఆడుతుంటారు.తాజాగా ఎల్లా జోహన్సెన్( Ella Johansen ) అనే ఓ విదేశీ యువతి కూడా కుర్తా కొనుగోలు చేసేటప్పుడు బేరం ఆడింది.

ఢిల్లీలోని పాపులర్ మార్కెట్ అయిన సరోజినీ నగర్‌లో( Sarojini Nagar ) ఆమె ప్రజలు తక్కువ ధరలకు అనేక వస్తువులను కొనుగోలు చేయాలని భావించింది.

అయితే కుర్తా కొనేందుకు ప్రయత్నించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.ఆమె తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తూ వీడియోలు చేస్తుంది.

వీడియోలో ఆమె ఒక కుర్తా కోసం రూ.250 చెల్లించగలనని చెప్పింది, కానీ దుకాణదారుడు అది రూ.

350 అని చెప్పాడు.అతను ఆమెకు 'సేల్ ఫిక్స్డ్ ప్రైస్ రూ.

350' అని రాసి ఉన్న బోర్డును కూడా చూపాడు.కానీ ఆమె చాలాసార్లు రూ.

250కి తగ్గించుకొని కుర్తా( Kurta ) ఇవ్వాలని అడిగింది.కానీ అందుకోసం దుకాణదారుడు ఒప్పుకోలేదు.

చివరికి ఎల్లాకు అక్కడ బేరం కుదరదని అర్థమై కుర్తా కొనుక్కుంది. """/" / ఆన్‌లైన్‌లో కొంతమందికి ఎల్లా వీడియో నచ్చలేదు.

వీధి వ్యాపారులతో బేరసారాలు చేయడం తప్పు అని అన్నారు.ఆమె ధనవంతురాలైనందున రూ.

350 సులభంగా చెల్లించగలదని, అలాంటప్పుడు మరీ డబ్బుల్లేనట్లు ఎందుకు అలా వ్యాపారులను ఇబ్బంది పెట్టడం అని ఇంకొందరు ఫైర్ అయ్యారు.

ఆమె సరదా కోసం బేరసారాలు సాగిస్తోందని, డబ్బు ఆదా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఫిక్స్డ్ ప్రైస్‌ల( Fixed Price ) షాప్‌లో బేరసారాలు చేయడం విచిత్రంగా ఉందన్నారు.

"""/" / ఆన్‌లైన్‌లో ఇతర వ్యక్తులు ఎల్లాను సమర్థించారు.ఆమె మర్యాదగా, న్యాయంగా ఉందని చెప్పారు.

మార్కెట్‌లో బేరసారాలు చేసే స్థానిక సంస్కృతిని ఆమె అనుసరిస్తోందని వారు తెలిపారు.ఫిక్స్‌డ్ ప్రైస్ సైన్ గురించి ఆమెకు తెలియదని, కొత్తగా దాని గురించి నేర్చుకుందేమో అని వారు అన్నారు.

ఇది విమర్శించాల్సిన విషయం కాదని, ఆమె ఎవరికీ హాని చేయలేదని వారు చెప్పారు.

ఎల్లా, ఆమె కుటుంబ సభ్యులకు 'లివింగ్ ది జో' అనే ట్రావెల్ ఛానెల్ ఉంది.

వారికి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.ఇప్పటి వరకు 65 దేశాలను సందర్శించి అనుభవాలను ప్రపంచంతో పంచుకున్నారు.

భారతీయులను గెలికిన చైనీస్ మహిళ.. ఏకపారేస్తున్న నెటిజన్లు..