వీడియో: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన కూతురు.. గవర్నమెంట్ జాబ్ ఉందని తెలిసి..?

సాధారణంగా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్‌( Government Job ) ఉందంటే చాలు ఏ తండ్రి అయినా తమ పిల్లని అతడికిచ్చి పెళ్లి చేస్తారు.

కొందరు మంచి వ్యక్తిత్వం, అందం చూస్తారేమో కానీ చాలామంది గవర్నమెంట్ జాబు ఉన్న అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇస్తారు.

ఎందుకంటే అమ్మాయిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేస్తే వారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితాంతం బతకగలుగుతారని నమ్ముతారు.

అయితే అమ్మాయి పేరెంట్స్ గవర్నమెంట్ ఉద్యోగి ని చూస్తే ఎలా ప్రవర్తిస్తారో ఫన్నీగా చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హర్షు అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన అ వీడియో చూసి నెటిజన్లు నవ్వు ఆపులేకపోతున్నారు.

ఆ వీడియోలో, తన కూతురు( Daughter ) ఓ గదిలో ఒక అబ్బాయితో కలిసి ఉండడాన్ని తండ్రి చూస్తాడు.

మొదట ఆ అమ్మాయి తండ్రి చాలా కోపంగా ఉంటాడు.కానీ కొద్ది సేపటికి తండ్రి మనసు మారిపోతుంది.

అదేంటి అనుకుంటున్నారా? ఆ అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని తెలుసుకున్నాక అమ్మాయి తండ్రి చాలా సంతోషించాడు.

"""/" / వీడియో ప్రకారం అమ్మాయి గది నుంచి అబ్బాయి నవ్వు వినపడగానే, అమ్మాయి తండ్రి ఆమె గది తలుపు గట్టిగా కొడుతాడు.

తలుపు తెరవమని కోరతాడు.తర్వాత వాళ్ళ మధ్య సంభాషణ మొదలవుతుంది.

అమ్మాయి గదిలో ఉన్న అబ్బాయి ఎక్కడ నక్కాడో తెలుసుకోవాలని తండ్రి గదంతా వెతుకుతాడు.

అమ్మాయి మొదట అబ్బాయి ఎవరూ లేడని చెప్తుంది.కానీ తర్వాత మంచం కింద దాగి ఉన్న యువకుడు కనిపిస్తాడు దాంతో అతనే తన భర్త అని ఆమె చెప్తుంది.

దాంతో తండ్రి మరింత కోపం వ్యక్తం చేస్తాడు.అతడికి గల్లా పట్టుకుంటాడు.

"""/" / ఆ అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని, నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత తండ్రి( Father ) మొహం మారిపోతుంది.

అతడికి వదిలేసి మంచం మీద కూర్చో పెడతాడు.మొదట కోపంగా ఉన్న ఆ తండ్రి తర్వాత చాలా సంతోషంగా మారిపోతాడు.

అమ్మాయికి టీ, బిస్కెట్లు పెట్టమని చెప్పి, అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడాలని ముందుకు వస్తాడు.

ఎంతో కోపంగా ఉండి అతడిని కొట్టేలాగా ప్రవర్తించిన తండ్రి సర్కారీ జాబ్ ఉందని తెలియగానే అపరిచితుల్లో రాము లాగా శాంతంగా మారిపోయాడు.

ఫైనాన్షియల్ స్టేబిలిటీ( Financial Stability ) అనేది ఇంతలా ఒకరి ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుందని ఊహించలేదంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం పవర్ అలా ఉంటుందని మరి కొంత మంది సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇది సరదాగా చేసిన వీడియోనే కావచ్చు.అని ఏ తండ్రి అయినా తమ బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు.

కోరిక వల్లే ప్రభుత్వ ఉద్యోగికి పిల్లనిచ్చి పెళ్లి చేయాలని భావిస్తారు.

భోజ‌నం నెమ్మదిగా తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలేంటో తెలుసా?