కోపంతో రోడ్డుపై బీభస్తాన్ని సృష్టించిన ఏనుగు.. వీడియో వైరల్

చిన్నపిల్లవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏనుగులు( Elephants ) అంటే చాలా ఇష్టం.

ఇక ఏనుగులను చూసేందుకు చాలామంది ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.సాధారణంగా ఏనుగులు చూడడానికి భారీగా కనపడతాయి.

అయితే ఏనుగు కోపం వస్తే మాత్రం ఆ ప్రాంతం అంతా బీభత్సం సృష్టిస్తాయి.

మనం సాధారణంగా అడవులలో నుంచి పంట పొలాల్లోకి, ఊర్లలోకి వచ్చే ఏనుగులు దాడి చేయడం చూస్తూనే ఉంటాం.

మరి కొన్ని ఏనుగులు అయితే.మనుషుల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి.

అచ్చం అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఒక భారీ ఏనుగు రోడ్డుపై( Road ) బీభత్సము సృష్టించింది.

ఆ సమయంలో రోడ్డుపై ఉన్న కారు, బస్సు పై దాడికి పాల్పడింది. """/" / ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా బీహార్ లోని( Bihar ) సరన్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది.

దసరా పండుగ( Dasara ) సందర్భంగా సరన్ మార్కెట్ ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో భక్తులు అందరు అక్కడికి చేరుకొని ఉత్సవాలను చూస్తున్నారు.

ఇంతలో అనుకోకుండా ఉత్సవాలలో పాల్గొన్న ఒక ఏనుగు రోడ్డుపై వస్తున్న క్రమంలో ఒక్కసారిగా కోపం వచ్చినట్లు ప్రవర్తించింది.

ఏనుగు పై మావటి కూర్చున్నా కానీ.ఏనుగు ఎదురుగా ఉన్న కారును తన దంతాలతో అటూ ఇటూ కదిలేస్తూ ఒక్కసారిగా పైకి ఎత్తి కిందకు పడేసింది.

"""/" / క్షణకాల వ్యవధిలోని ఆ కారును తొక్కు తొక్కు చేసింది.ఇక అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న బస్సును కూడా కిందకు తోయాలని ప్రయత్నం చేయగా.

మావటివాడు కర్రతో కొడుతూ ఏనుగును కంట్రోల్ చేయగలిగాడు.ఇక విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఆ ఏనుగును మరో ప్రాంతానికి తరలించేశారు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు.వామ్మో.

ఈ ఏనుగంటి చాలా డేంజర్ గా ఉంది అని కామెంట్ చేయగా.మరికొందరు, ఆ ఏనుగుకి ఇంకా ఫుడ్ పెట్టలేదా ఏంటి అని కామెంట్ చేస్తున్నారు.

వైరల్ వీడియో: కొడుకు బౌలింగ్ లో బౌండరీ వెలుపల క్యాచ్ పట్టిన తండ్రి