ఈ వ్యక్తిని కాటేసి ప్రాణాలను కోల్పోయిన కింగ్ కోబ్రా.. ఆస్పత్రికి వెళ్లి ఎంత పని చేసాడో..

భూమి మీద అత్యంత విషపూరితమైన జంతువులలో పాము కూడా ఒకటి.ఇంత విషపూరితమైన ఈ పాము కరిస్తే ఎవరైనా సరే కొన్ని నిమిషాల్లో చనిపోతారు.

అయితే ఒక మనిషిని ఈ భూమి మీద అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా కాటేసింది.

సాధారణ విషపూరితమైన పాము కాటేస్తే కూడా వెంటనే చికిత్స చేయకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

కానీ ఇందుకు వ్యతిరేకంగా కింగ్ కోబ్రా ఒక వ్యక్తిని కాటేసి అదే చనిపోవడం జరిగింది.

ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఉన్నది ఏమిటంటే బాగా మద్యం తాగిన ఒక వ్యక్తి ఖుషీనగర్‌ జిల్లా ఆస్పత్రిలోకి అత్యవసర విభాగానికి వచ్చాడు.

డాక్టర్లను పిలిచి తనను కింగ్‌ కోబ్రా కాటేసిందని తెలిపాడు.ఆ తర్వాత కాసేపటికే అది చనిపోయందని చెప్పాడు.

అతడి మాటలు విన్న డాక్టర్లు షాక్కు గురయ్యారు. """/"/ కింగ్‌ కోబ్రా కాటేస్తే ఆ కాటేసిన వ్యక్తి కచ్చితంగా చనిపోతాడు, కానీ ఈ వ్యక్తి విషయంలో మాత్రం వ్యతిరేకంగా జరిగింది ఏమిటి అని ఆశ్చర్యపోయారు వైద్యులు.

పైగా ఆ వ్యక్తి మద్యం సేవించి ఉండటం వల్ల ఆ వ్యక్తి మాటలను వైద్యులు నమ్మలేదు.

దానితో ఆ వ్యక్తి డాక్టర్లను నమ్మించేందుకు తనతో ఒక సంచి లో పామును కూడా తెచ్చాడు.

ఆ పాము చనిపోడాన్ని చూసి డాక్టర్లు నిజంగానే ఆశ్చర్యపోయారు.ఆ డాక్టర్లు ఆ వ్యక్తిని వెంటనే చికిత్స విభాగానికి పంపి చికిత్స అందించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోను చూసినా నేటిజన్లు చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

వామ్మో వీడు కింగ్ కోబ్రా కన్నా డేంజర్ రా సామి అని కామెంట్లు చేస్తున్నారు.

మరి కొంతమంది వీడు కావాలనే చనిపోయిన పాములు తెచ్చి యాక్షన్ చేస్తున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు.

వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్..!!