వైరల్ వీడియో: క్రికెట్ లో ఇలా కూడా బ్యాట్స్మెన్ అవుట్ ఇచ్చేస్తారా..?!

ఏదైనా క్రీడ మైదానాలలో ఆటగాళ్లు విజయం సాధించే విషయంలో అనేక రికార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి మనకందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో క్రికెట్ ఆడే సమయంలో కొంత మంది క్రికెటర్లు వారి లక్ష్యఛేదనలో ఒకవైపు బౌలింగ్, మరోవైపు బ్యాటింగ్ లో వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఒక్కోసారీ ఆ జట్టు వికెట్  కోల్పోయినప్పుడు కొన్ని కొన్ని వాగ్వాదాలు తలెత్తడం మనం చూస్తూనే ఉంటాం.

ఒక్కోసారి స్టేడియంలో ఎన్ని రకాల కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఆ వికెట్స్ వివాదానికి గురి చేస్తూ ఉంటాయి.

ఇది ఇలా ఉండగా.మూడు వన్డేల సిరీస్‌ లో భాగంగా శ్రీలంక, వెస్టిండీస్‌ మధ్య తొలి మ్యాచ్ ముగిసింది.

ఈ మ్యాచ్ లో భాగంగా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది.

ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో భాగంగా శ్రీలంక బ్యాట్స్మెన్ ఓపెనర్ దనుష్క గుణతిలక ఔట్ కాస్త వివాదాస్పదంగా మారిపోయింది.

అంతేకాకుండా మూడో అంపైర్ నిర్ణయం కూడా అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

వెస్టిండీస్ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ వేసిన 21 ఓవర్ మొదటి బంతిని దనుష్క డిఫెన్స్ చేశాడు.

ఆ బంతి అతడి వద్దకు వచ్చి ఆగిపోవడంతో ఒక సింగిల్ తిందామని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా దీంతో బౌలింగ్ చేసిన పొలార్డ్‌ వెంటనే స్పందించి ఔట్ చేయడానికి ముందుకు వచ్చాడు.

ఇదిలా ఉండగా ఇది గమనించిన ధనుష్ మరో వైపు ఉన్న బ్యాట్స్మెన్ రావద్దు అని సైగ చేశాడు.

ఈ తరుణంలో దనుష్క క్రీజులోకి వెళ్తూ అనుకోకుండా బంతిని కాలితో తన్నేశాడు.ఇలా ఉండగా అప్పటికే పొలార్డ్‌  ఔట్ చేసేందుకు బంతి దగ్గరకు రాగా ధనుష్ క్రీజ్లోకి వెళ్ళిపోయాడు.

ఇది అంతా బాగా ఉండగా మరోవైపు తమ ఫీల్డింగ్ అడ్డంగా వచ్చాడని విండీస్ కెప్టెన్ అంపైర్‌ కు అప్పీల్ చేశాడు.

దీంతో వెంటనే ఆన్ ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్న‌ల్‌ గా ఔట్ అని ప్రకటించాడు.

దీంతో మూడో అంపైర్ నిగెల్ గుగైడ్‌ ని అడగడంతో అతను కూడా వీడియోని వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత దనుష్క ఔట్ గా ప్రకటించడం జరిగింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో దనుష్క ఔట్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదంపై భారత వెటరన్‌ ఆఫ్ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్‌ కూడా స్పందించి సోషల్ మీడియా వేదికగా పై తన సందేహం వ్యక్తపరిచారు.

ఇది ఏ విధంగా ఔట్ అంటూ ఐసీసీ ని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు.వీడియో ఆధారంగా దనుష్క కావాలనే అడ్డం వచ్చినట్లు లేదనే విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది అంటూ హర్భజన్ సింగ్  తెలిపారు.

"""/"/ మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆ వీడియోను షేర్ చేస్తూ అంపైర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదంపై కేవలం  హర్భజన్ సింగ్ మాత్రమే కాకుండా టామ్ మూడీ, మైఖేల్ వాన్, రస్సెల్ ఆర్నాల్డ్ కూడా ఐసీసీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 49 ఓవర్లలో 232 పరుగులు తీసి ఆలౌట్ అయ్యింది.

అనంతరం బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చిన విండీస్ జట్టు ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్ 90 బంతుల్లో 65 పరుగులు, షై హోప్ 133 బంతుల్లో 110 పరుగులు తీయడంతో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ ఘన విజయం సొంతం చేసుకుంది.

యంగ్ ఏజ్ లోనే వైట్ హెయిర్ వచ్చేసిందా.. వర్రీ అవ్వకుండా ఈ రెమెడీని ట్రై చేయండి!