వైరల్ వీడియో: ట్రాక్టర్‌తో పొలం దున్నిన ధోని!

అవును, మీరు విన్నది నిజమే.మన మాజీ కెప్టెన్‌ ధోని రైతుగా మారిన వైనాన్ని ఎపుడైనా చూసారా? చూడకపోతే ఇక్కడ వీడియో చూడండి మరి.

ట్రాక్టర్‌తో పొలం దున్నే వీడియోను ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా ఇపుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇంకా ఆ వీడియోకి "కొత్త పని నేర్చుకోవడం మంచిదే కాని, పని పూర్తి చేసేందుకు ఇంకా చాలా సమయం పట్టింది!" అంటూ ధోని క్యాప్షన్‌ పెట్టడం గమనించవచ్చు.

ఇకపోతే మన ధనాధన్ ధోనికి క్రికెట్ ఆడడం తరువాత గ్రామీణ వాతావరణం, వ్యవసాయం అంటే ఎంతో ఆసక్తి అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే.

"""/"/ అందుకే మహి ఖాళీ సమయాల్లో కర్షకుడి అవతారం ఎత్తుతున్నాడు.గతంలో కూడా ధోని ఇలా ట్రాక్టర్ ఎక్కి పొలాన్ని దున్నిన సంఘటనలు చూశాం.

కాగా తాజాగా మనోడు మరలా వ్యవసాయ భూమిలో మెరిశాడు.ఇదే కాకుండా కోళ్ల వ్యాపారం కూడా చేస్తున్నారు ధోనీ.

సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్దగా యాక్టివ్‌గా ఉండని ధోని రెండు సంవత్సరాల తర్వాత, ఒక కొత్త పోస్ట్‌ను పంచుకోవడం విశేషం.

దాంతో ఈ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది.ఈ వీడియో పోస్ట్ ఫిబ్రవరి 8 సాయంత్రం అప్‌లోడ్ చేయబడింది.

"""/"/ అప్‌లోడ్ చేసిన కొద్ది గంటల్లో, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్రేజీ వైరల్ అవుతోంది ఆ వీడియో.

ఈ వీడియో ఇప్పటికే మిలియన్ల వీక్షణలు పొందగా 1.9 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

అంతేకాకుండా 51,000 కామెంట్లు పొందగా కొన్ని వేల సంఖ్యలో షేర్‌లను పొందింది.ఇకపోతే ధోనీ ఇస్టాన్‌లో చివరిసారిగా చూసుకుంటే జనవరి 8, 2021లో పోస్టు చేయడం జరిగింది.

అంటే దాదాపు 108 వారాల క్రితం చేసిన ఈ పోస్టులో MSD తన సొంత పొలం నుండి స్ట్రాబెర్రీలను తెంచుకుని తినడం అందులో గమనించవచ్చు.

ఆ తరువాత తాజా వీడియో పొలం దున్నే వీడియోని షేర్ చేయడం విశేషం.