వైరల్ వీడియో: బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు.. చివరికి పోలీసుల దెబ్బకి..?!

ఈ మధ్యకాలంలో చాలామంది యువత సోషల్ మీడియా( Social Media)లో పాపులర్ అయ్యేందుకు విచిత్రమైన పనులు చేయడానికి కూడా సిద్ధం అయిపోతున్నారు.

ఇలా చేయడంలో ఒక్కోసారి పొరపాటు జరగడంతో చివరికి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్నవారు అనేకమంది ఉన్నారు.

ఇందుకు సంబంధించి అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా ఇలాంటి వీడియో మరొకటి నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియోలో బైక్ పై ప్రమాద విన్యాసాలు చేస్తున్న వ్యక్తిపై కాన్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను వెళితే. ""<img Src=" ""img Src=" " / "/> కాన్పూర్( Kanpur ) నగరానికి చెందిన ఓ వ్యక్తి బైక్ పై నిలబడి విన్యాసాలు చేస్తూ ఉన్నాడు.

దీంతో అతడు విన్యాసాలు చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త పోలీసుల కంటపడటంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ విషయంపై పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటన నవాన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా బ్యారేజీ ప్రాంతంలో జరిగిందని తెలిపారు.

"""/" / ఈ ఘటనతో పోలీసులు అతనికి కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనికి 12,000 జరిమానాను కూడా విధించారు.

ఈ ఘటనకు సంబంధించి కాన్పూర్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.

సోషల్ మీడియాలో బైక్ సంబంధిత విన్యాసాల వీడియో.వైరల్ కావడంతో అతనికి ఐపిసి సెక్షన్ 336 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

నెంబర్ ప్లేట్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.