వైరల్ వీడియో : ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది.. గోడ మీద డాన్స్ చేస్తూ.?
TeluguStop.com
ప్రస్తుతం చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో పాటు సాహసాలు కూడా చేస్తూ ఉన్నారు.
ఇందులో భాగంగా కొంత మంది వారికి సాధ్యం కావని తెలిసిన కూడా ఫీట్లు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.
ఈ సాహసాలలో కొంత మంది తీవ్ర గాయాల పాలవుతూ ఉంటే.మరికొందరు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు.
"""/" / ఇందులో భాగంగానే చాల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతానే ఉంటాయి.
ఇకపోతే, అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి పిట్టగోడ మీద డాన్స్ చేయడానికి ప్రయత్నించి చివరికి కింద పడిపోయాడు.
ఈ క్రమంలో ఆ గ్రామంలో జాతర జరుగుతున్న క్రమంలో ఏదో డాన్స్ ప్రోగ్రాంలో( Dance Program ) అందరూ ఆసక్తిగా వీక్షిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ఒక కుర్రాడు ప్లాస్టింగ్ ( Plastering The Boy )కూడా పూర్తి కానీ ఒక గోడ మీద నిల్చోని డాన్స్ చేయడం మొదలుపెట్టాడు.
"""/" /
ఈ క్రమంలో ఒక స్టంట్ కోసం పొజిషన్ తీసేందుకు ప్రయత్నం చేయగా.
కాస్త బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు.అప్పటికి గోడను పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
కానీ, ఆ గోడతో పాటు అతడు కూడా కింద పడిపోయాడు.ఇక ఈ వీడియోను చూసిన కొంత మంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
అలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం అవసరమా బ్రో.అని కామెంట్ చేస్తున్నారు.
ఇక మరికొందరు అయితే, ఏదో చేయాలనుకుంటే ఏదో అయింది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.
బెల్లం, లవంగాలు కలిపి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?