వైరల్ వీడియో: ముసలాయనని కుళ్లబొడిచిన ఎద్దు.. ఎందుకంటే..?!

ఈ మధ్యకాలంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

అందులో ముఖ్యంగా పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు మరీ ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే తాజాగా మరో వీడియో ఒకటి వైరల్ గా మారింది.ఆ వీడియోలో ఓ ఎద్దు రోడ్డుకు ఒకవైపు ప్రశాంతంగా నిలబడి ఉంది.

అయితే అటుగా వెళుతున్న ఓ పెద్దాయన ఆ ఎద్దును చూసి అరే ఏంది ఈ ఎద్దు రోడ్డుపై అలా ఉంది అనుకుంటూ తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఎద్దు పై రెండు దెబ్బలు వేసాడు.

అయితే అప్పటికి ఆ ఎద్దు ఏమీ అనకుండా అలాగే ఉంది.ఇకపోతే మరోసారి దెబ్బ వేయాలనుకున్న ఆ పెద్దాయనకు ఎద్దు రివర్స్ అయ్యింది.

మరో దెబ్బ వేసే లోపే ఒక్కసారిగా ఆ పెద్దాయన పైకి దూసుకెళ్లింది.పొట్టలోకి ఆ ఎద్దు కొమ్ములను పోనిచ్చి పైకి ఎత్తి కింద పడేసింది.

అదే సమయానికి అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు గట్టిగా అరవడంతో ఎద్దు ఇక ఆ పెద్దాయనని వదిలి పెట్టింది.

దీంతో ఆ పెద్దాయన బతికిపోయాను దేవుడా అంటూ ఆ సంఘటన నుండి బయట పడ్డాడు.

ఇక ఆ ముసలాయన అదృష్టం ఏమోగానీ.ఆయనకు ఎద్దు కొమ్ములతో పొడిచినా కానీ ఎటువంటి పెద్ద గాయాలు కాలేదు.

కొమ్ములతో పొడిచిన కానీ ఎక్కడ కూడా గాయం అయిన ఆనవాలు కనపడలేదు.చివరకు ఆవును ఏమి చేసేది లేక ఆ పెద్దాయన అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

దీంతో ఆ ఆవు కూడా ఆ పెద్దాయన బతుకుపో అన్నట్లుగా వదిలేసింది.ఎక్కడో రోడ్డుకు ఒకవైపు ప్రశాంతంగా నిలబడిన ఎద్దును ఊరికే ఉండకుండా కట్టెతో కొట్టడంతో చివరికి పరిస్థితి ఇలా తయారైంది.

మొత్తానికి ఎద్దులతో పెట్టుకుంటే సీన్ రివర్స్ అవుతుంది అని మరోసారి రుజువైంది.ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో క్లిప్పింగ్స్ అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వగా.

అందులోని వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి.

వైరల్ వీడియో: వెరైటీగా కనపడ్డ రాయి.. తవ్వి చూడగా ఏకంగా..