అప్పుడే పుట్టిన చెల్లిని చూసి ఈ బాలుడు ఎలా ఎమోషనల్ అయ్యాడో చూస్తే..
TeluguStop.com
మగవాళ్లు ఎమోషన్స్ చూపించరు.ఆడవారిలాగా వారు అసలు ఏడవరు అని చాలామంది చెబుతుంటారు.
వారికి అసలు ఎమోషన్స్ చూపించడమే రాదు వాళ్లకి అసలు ఎమోషన్సే ఉండవు అని కూడా అంటారు.
ఇక చిన్న పిల్లల విషయంలో కూడా అలాగే మాట్లాడతారు.అమ్మాయిలు మాత్రం పుట్టిన సమయం నుంచే చాలా ఎమోషన్స్( Emotions ) చూపిస్తారని, తమ తల్లిదండ్రులపై ప్రేమ కురిపిస్తారు అని అంటారు కానీ అది నిజం కాదు అని తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
మగవాళ్లు పెద్దవారైనా, చిన్నపిల్లలైనా తమ భావాలను తెలియజేయడానికి ఏడుస్తారు.రీసెంట్ గా ఒక చిన్న బాలుడు అప్పుడే పుట్టిన తన చిట్టి చెల్లెల్ని( Sister ) చూసి చాలా ఏడ్చేసాడు.
చిన్న పిల్లడే అయినా, అతని హృదయం ఆనందంతో నిండిపోయి, ఆ సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు.
అందుకే కంటతడి పెట్టుకున్నాడు.ఆనందభాష్పాలు రాల్చాడు.
ఈ అద్భుతమైన క్షణాన్ని ఫోటోగ్రాఫర్ గ్రేస్ డూలీ కెమెరాలో బంధించారు.ఈ వీడియోను @goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయగా, చాలా మంది ఈ వీడియోని చూసి ఎంతో ఆనందించారు.
"""/" /
‘తన కొత్త చెల్లిని మొదటిసారి కలుసుకోవడం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇందులో బాలుడు( Boy ) తన కొత్తగా పుట్టిన చెల్లిని మొదటిసారిగా చూస్తున్నాడు.
తల్లి తన కూతురును అబ్బాయి ఒళ్లో పెట్టిన క్షణం నుంచి అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి.
అతను ఎంతో ఆనందంతో కన్నీళ్లు( Happy Tears ) పెట్టడం చూసి ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయింది.
కొద్ది సేపటికి కళ్లు తుడుచుకుని తన చెల్లిని ప్రేమగా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు.
"""/" /
ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.అంతేకాదు, లక్షల కొద్దీ లైక్‌లు, వేల కొద్దీ కామెంట్లు వచ్చాయి.
చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటూ, ఈ క్షణం ఎంతో అందంగా ఉందని చెప్పారు.
కొంతమంది, "ఆ అమ్మాయికి అంత మంచి అన్న ఎవరూ ఉండరు" అని కూడా కామెంట్ చేశారు.
అయితే, అందరూ పిల్లలు కొత్త సోదరుడు లేదా సోదరిని చూసి ఇలానే ప్రతిస్పందించరు.
కొందరు అసూయ పడవచ్చు, కోపం రావచ్చు లేదా కొత్త బిడ్డను తిరిగి పంపించాలని అనుకోవచ్చు.
కొంతమంది పిల్లలు తమ ప్రవర్తనలో మార్పులు చూపించవచ్చు.అయితే, ఇలాంటి వీడియోలు సోదరుల మధ్య ఉండే ప్రేమ ఎంతటి గొప్పదో మనకు తెలియజేస్తాయి.
రాజమౌళి బాటలో నడుస్తున్న సందీప్ రెడ్డి వంగ…