వైరల్ వీడియో: పెళ్లి పీటలపై పానీ పూరిల దండలు ధరించిన వధువు..!

పానీపూరి అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.జీవితంలో ఏమీ లేకపోయినా పానీపూరి మాత్రం లేకుంటే ఒప్పుకోం అనేవాళ్లు చాలా మందే ఉన్నారు.

అంతలా పానీపూరీని ప్రేమించే వాళ్లు ఉన్నారు.అలా ఓ యువ‌తికి పానీపూరీ అంటే మ‌హా ప్రాణం.

దీంతో ఏకంగా ఆమె పెళ్లి జ‌రిగిన వేళ ఆభ‌ర‌ణాల‌కు బ‌దులుగా గోల్‌గ‌ప్పా మాల‌ను ధ‌రించింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరల్ అవుతోొంది.నార్త్ ఇండియా నుంచి అడుగు పెట్టిన గోల్ గప్పకు చాలా మంది అభిమానులున్నారు.

పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని చాలా మంది ఆవురావురు మంటూ ఆరగిస్తుంటారు.

సాధారణంగా అయితే మసాలాను, పానీ ని విడి విడిగా రెడీ చేస్తుంటారు.పానీపూరి అనేది ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి.

అలా ఓ భారతీయ యువతి తనకు పానీపూరి మీద ఉన్న ప్రేమను ఇంట్లో తెలియజేసింది.

దీంతో ఆమె పెళ్లికి దానినే మాలగా వేశారు.పెళ్లి కూతురు పెళ్లి మండపంలో పూలదండలకు బదులుగా పానీ పూరికి ఉపయోగించే చిన్న చిన్న పూరీలను నగలుగా కుట్టుకుని దండలాగా వేసుకుంది.

పెళ్లి దండలు, కిరీటం వంటి ఆభరణాలు లాగానే పూరీలను అలంకరించుకుంది.ఆ పెళ్లికూతరు తనకు తానుగా పానీ పూరికి గొప్ప ప్రేమికురాలినని ప్రపంచానికి చాటి చెప్పింది.

దక్షిణ భారత దేశానికి చెందిన అక్షర అనే నవ వధువు తన పెళ్లి రోజున పూరీలతో చేసినటువంటి నగలను వేసుకుంది.

"""/"/ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అంతేకాదు ఆమె ముందు ఉన్న ప్లేట్ కూడా గోల్గప్పలతో నిండి ఉండేలా కుటుంబీకులు చేశారు.

వధువు పెళ్లి పీటల మీద ఉన్నప్పుడు ఒక అతిధి వచ్చి గొల్గప్ప కిరీటాన్ని ఆమె తలపై పెట్టడం అందర్నీ నవ్వు తెప్పిస్తోంది.

కిరీటం పెట్టిన తరవాత పెళ్లి కూతురు సంతోషంగా నవ్వడం అందర్నీ ఆనందంతో ముంచెత్తింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

శాన్‌ఫ్రాన్సిస్కో కంటే బెంగళూరే బెటర్.. మరీ ఇంత మెగా చీపా, ఎన్ఆర్ఐ ట్వీట్స్ వైరల్