నడిరోడ్డులో కామాంధుడి చెంప చెల్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్..

ఈ రోజుల్లో కామంధులు బాగా రెచ్చిపోతున్నారు.పబ్లిక్‌లోనే ఆడోళ్ళపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

కొంతమంది మహిళలు( Women ) ఇలాంటి వారిని పట్టుకుని దేహశుద్ధి చేస్తున్నారు.తాజాగా అలాంటి ఓ ధైర్యవంతురాలైన యువతికి( Brave Girl ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం,( Uttar Pradesh ) బులంద్‌షహర్ జిల్లా, ఖాన్‌పూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వైరల్ వీడియోలో( Viral Video ) ఒక విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కోవడం కనిపించింది.

యువతి సైకిల్‌పై వెళుతుండగా కామాంధుడు అసభ్యంగా కామెంట్ చేశాడు. """/" / నిరాశ, కోపంతో ఆమె తన సైకిల్ ఆపి, ఆ కామాంధుడిని పట్టుకుంది.

ఆపై అతన్ని చాలాసార్లు చెంప పగలగొట్టింది.పట్టపగలు, బిజీగా ఉన్న మార్కెట్‌లో అతన్ని పట్టుకొని విజయశాంతి లెవెల్ లో ఆ యువతి వీర కొట్టుడు కొట్టింది.

వీడియోలో బ్యాగ్‌ని సైకిల్ క్యారియర్‌పై పెట్టి కామ కోరికలతో రగిలిపోతున్న ఆ యువకుడిని కొట్టడం కనిపించింది.

చివరికి స్థానికుల జోక్యం చేశారు.దాంతో యువతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

‘ఘర్ కే కలేష్’ ఎక్స్‌ అకౌంటు షేర్ చేసిన ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

"""/" / ఆ విద్యార్థిని ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.ఎవరైనా వేదిస్తే అమ్మాయిలు ఇలానే తిరగబడాలి లేకపోతే వాళ్ళు రెచ్చిపోతారు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

భయపడుతూ వారికి బలి కావడం కంటే ఎదురు తిరిగి వాళ్ళు అలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పాలని కోరుతున్నారు.

ఇలాంటి వారిని ఎదుర్కోవాలంటే ఆత్మ రక్షణగా మార్షల్ ఆర్ట్స్( Martial Arts ) నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు.

చాలామందిని ఆమెను బ్రేవ్ గర్ల్ అని పిలుస్తున్నారు.మరి ఈ కామాంధుడిని స్థానికులు పోలీసులకు అప్పజెప్పారా? ఏదైనా కేసు నమోదు అయిందా అనే వివరాలు మాత్రం తెలియ రాలేదు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

రంగంలోకి రాబిన్ శర్మ .. కీలక బాధ్యతలు ఇచ్చిన బాబు