వైరల్ వీడియో: బ్లాక్ పాంథర్ అర్ధరాత్రి చిమ్మచీకట్లో..?!

ప్రస్తుత రోజులలో వన్యప్రాణులు ఆహారం కోసం మనుషులు నివసిస్తున్న ప్రాంతం లోకి వస్తున్న వార్తలు తరుచుగా మనం చూస్తూనే ఉన్నాం.

ఇందులో ఎక్కువగా చిరుత పులులు, పెద్ద పులులు, సింహాలు లాంటివి గ్రామాలలో నగరాలలోకి ఆహారం కోసం రావడం మనం వార్తల్లో చదువుతూనే ఉన్నాం.

ఇది ఇలా ఉండగా తాజాగా ఓ బ్లాక్ పాంథర్ లు గ్రామాలలో కానీ, నగరాల లోకి కానీ ప్రవేశించినట్లు మనం పెద్దగా వినలేదు.

దీనికి కారణం ఆ జాతికి చెందిన పులులు చాలా అరుదైనవి, పైగా అవి ఎక్కువగా దట్టమైన అడవులలో తప్ప జన నివాసాల మధ్యకు  రావు.

ప్రస్తుత రోజుల్లో అడవులలో అవి తినడానికి ఎటువంటి ఆహారం దొరకకపోవడంతో వాటి ఆహారం కోసం చుట్టుపక్కల ఉండే గ్రామాలలో కి వచ్చేస్తున్నాయి.

తాజాగా ఒక బ్లాక్ పాంథర్ అలాగే ఒక ఊర్లోకి వచ్చిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వారికి మన భారతీయులకు బ్లాక్ పాంథర్ అంటే చాలా మక్కువ.దీనికి కారణం ఏమిటంటే యానిమేషన్ సిరీస్ జంగిల్ బుక్‌ లో పిల్లాడికి తోడుగా బఘీరా (‘Bagheera’) అనే బ్లాక్ పాంథర్ ఉండి సహాయపడుతుంది.

అందుకే మన భారతీయులకు భగీరథ అంటే చాలా ఇష్టం.తాజాగా అర్ధరాత్రి వేళ ఒక బ్లాక్ పాంథర్ ఒక ఇంటి ముందుకు వచ్చి, అక్కడున్న ఒక తెల్లని కుక్కను చూసి అక్కడికి సైలెంట్ గా వెళ్లి వైలెంట్ గా దాన్ని నోటితో  పట్టుకుంది.

ఒక్కసారిగా కుక్క కేక పెట్టేసరికి ఆ కుక్కను బ్లాక్ పాంథర్ దానిని నోట కరచుకొని చాలా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రముఖ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా  చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూస్తున్న కాసేపు నెటిజన్స్ తల తిప్పుకోకుండా ఏమి జరుగుతుందో ఏమో అన్న ఆసక్తికరంగా ఎదురు చూస్తూ చూశారు.

వీడియో ఆధారంగా ఆ ప్రాంతం పర్వతాల పక్కన ఉన్న ప్రదేశంగా అర్థమవుతుంది.ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ అడవులు తగ్గిపోవడానికి గల ముఖ్యకారణం మనుషులే కాబట్టి ఇలాంటి నల్ల చిరుతలు కూడా మనుషులలో ఉండే ప్రాంతాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వావ్, వాటే ఐడియా.. వాహనదారులకు ఎండ తగలకుండా సిగ్నల్స్‌ వద్ద గ్రీన్ నెట్స్..