వైరల్ వీడియో: అమ్మాయి షూలో నాగుపాము.. జాగ్రత్త సుమీ..

ముఖ్యంగా వర్షాకాలంలో( Rainy Season ) వానలు పడుతున్న సమయంలో కొన్ని జంతువులు, అలాగే కొన్ని విష సర్పాలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి రావడం సహజం.

కాబట్టి వర్షాకాల సమయంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.విష పాములు ఇంకా కొన్ని రకాల విషపు ప్రాణులు ఇళ్లలోకి చొరబడడం జరుగుతూ ఉంటాయి.

ముఖ్యంగా వాన నుండి తప్పించుకునేందుకు పాములు మనుషులు నివాసం ఉండే ఇళ్లలోకి ప్రవేశించి అక్కడ రంధ్రాలను ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటాయి.

"""/" / అయితే ఇలాంటి సందర్భాలలో అనేక పాములు ఇంట్లోనే బట్టల మధ్యలో, లేకపోతే ఏదో ఇంట్లోని ఒక మూలన, అలాగే మనుషులు ధరించే బూట్లలో కనిపించడం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూసే ఉంటాము.

తాజాగా అలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఓ యువతీ షూ ధరించబోయే చివరి క్షణంలో ఏదో ఆమెకు షూ లో ఉన్నట్లుగా అనుమానం వచ్చింది.

దాంతో ఆవిడ షూలో ఏముందని నిశితంగా చూడడంతో షూలో చిన్న నాగుపాము( Cobra ) ఉండడం గమనించింది.

ఒకవేళ అలా చూడకుండా డైరెక్ట్గా కాలును పెట్టింటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది.

"""/" / అయితే వైరల్ అవుతున్న వీడియోలో నాగుపాము షూ లోపల దాగి ఉన్న సమయంలో ఆ విషయాన్ని గమనించిన ఆమె వారి ఇంట్లో వారికి తెలిపింది.

అలా పామును చూసిన వెంటనే ఆ బాలిక భయంతో గట్టిగా కేకలు వేసింది.

దానితో విషయాన్ని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేయడంతో వారు వచ్చి షూ లో ఉన్న పామును చాకచక్యంగా బయటకు తీసి ఆ ఇంట్లో నుంచి బయట మరో ప్రాంతంలో వదిలేశారు.

ఇక ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ వామ్మో.వర్షాకాలంలో ఇలాంటివి కూడా జరుగుతాయి కదా జాగ్రత్తగా ఉండాల్సిందే మరి అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇదేం రోటీ రా బాబు.. దుప్పటి సైజులో ఉందేంటి.. పాకిస్థానీ వ్యక్తి వీడియో వైరల్!