వీడియో వైరల్: అడవిలో చిందులేస్తున్న ఓ మహిళ పోలీస్ అధికారి.. ఎందుకంటే..?!

ఎవరికైనా సాధారణంగా చిరుజల్లులు పడుతూ ఉంటే ఆ వర్షంలో తడిసి ఆటలు ఆడాలని కోరికగా ఉంటుంది.

ఇది మనందరికీ తెలిసిన సర్వసాధారణ విషయము.అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి వర్షంలో తడుస్తూ చిందులు వేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఒక మహిళ ఫారెస్ట్ అధికారి అటవీ ప్రాంతంలో కురుస్తున్న వానలో మైమరిచి చిందులు వేస్తూ కేరింతలు కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే మనందరికీ ఆ అధికారిని ఎందుకు చిందులు వేసిందో తెలుసుకోవాలని ఉంది కదా.

ఇక విషయంలోకి వెళితే.ఒడిస్సా రాష్ట్రంలో స్లిమ్ ఫాల్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో గత నెల రోజుల నుంచి విపరీతంగా మంటలు చెలరేగుతున్నాయి.

ఈ మంటలను అదుపు చేయడానికి అటవీ, అగ్నిమాపక శాఖ అధికారులు చాలా కృషి చేస్తున్నారు.

అయినా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు.అయితే ఆ సమయంలో అనుకోకుండా వర్షము పడడంతో విధుల్లో ఉన్న ఆ ఫారెస్ట్ అధికారిని స్నేహ దళ్ వర్షంలో తడుస్తూ ఆనందంతో వర్షంలో సినిమా పాటకు అన్నట్లుగా డాన్స్ వేసింది.

కన్నులకు విందు అయినా ఈ దృశ్యాన్ని కిషోర్ మెహంతా అనే వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

ఈ వీడియోను చూసిన అభిమానులు ఆమెను ప్రశంసించారు.అడివి రక్షించబడినది అనే సంతోషంతో చిందులు వేసింది అంటూ నెటిజన్లు ప్రశంసించారు.

విధుల పట్ల ఆమెకు గల అంకితభావాన్ని ప్రశంసించారు.అడవి సంపదను కాపాడుకునే క్రమములో మేము విఫలమైన మాకు దేవుడు వర్షం రూపంలో వచ్చి సహాయము చేశాడంటూ ఆ అధికారిని పెద్దగా కేకలు వేస్తూ, సంతోషంతో చిందులు వేసింది.

మనలోకుడా పట్టరాని సంతోషం కలిగినప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉండడం పరిపాటే కదా.

రజినీకాంత్ ప్లాప్ డైరెక్టర్ల కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదా..?