వైరల్ వీడియో: ఓ మహిళ రైలు సీటు కోసం ఏకంగా..?!

సాధారణంగా రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం.దూర ప్రయాణాలకు బస్సుల్లో కంటే రైళ్లలో ప్రయాణం చేయాలని చాలా మంది అనుకుంటారు.

అయితే ఈ మధ్య కరోనా కారణంగా చాలా రైళ్లు పట్టాలెక్కడం ఆపేశాయి.కరోనా కారణంగా చాలా మంది ప్రయాణాలను తగ్గించుకున్నారు.

చాలామంది రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడి ప్రాణాలను వదిలారు.అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటం వలన రైళ్లు యథాతధంగా పట్టాలెక్కుతున్నాయి.

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రైలు ఎక్కేందుకు ఓ మహిళ పడరాని పాట్లు పడింది.

రైలులోకి వెళ్లడానికి ఓ మహిళ కిటికీలోంచి లోపలికి వెళ్లిపోయింది.సాధారణంగా రైలు ఎక్కడానికి కొంతమంది అందర్నీ తోసుకుంటూ ఎక్కి లోపలికి వెళ్లిపోతారు.

ఆ సమయంలో వాళ్లు సీటును సంపాదించాక ఎంతో గొప్ప ఘనకార్యం చేసినట్లు భావిస్తారు.

ఆనందంతో పొంగిపోతారు.ఉత్సాహంగా ఉల్లాసంగా చిందులేస్తారు.

యువత అయితే ప్రయాణాలలో సీటు సంపాదించడం కోసం బస్సులు, రైళ్ల కిటీకిలోంచి ఎక్కడం మనం చూస్తూనే ఉంటాం.

ఇక్కడ కూడా ఓ మహిళ రైలు కిటికీ ద్వారా లోపలికి ఎక్కింది.రైలు బోగికి ఉండే ఎమర్జెన్సీ కిటికీ డోర్ నుంచి రైల్లోకి వెళ్లిపోయింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రైళ్లలో ఎమర్జెన్సీ భోగిని కచ్చితంగా ఉంటుంది.

ఆ విండోను కొన్ని అత్యవసర టైమ్స్ లోనే వినియోగించాల్సి ఉంటుంది.అలాంటి ఎమర్జెన్సీ విండో నుంచి ఓ మహిళ రైలు లోపలికి వెళ్లి సీటును పొందింది.

మహిళా అలా రైలు లోపలికి వెళ్లడాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

నెట్టింట ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కైపోతున్నారు.దీనిని చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.

మహిళలు ఇలా కూడా రైలు కిటికిలోంచి లోపలికి వెళ్తారా అంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వింటర్ లో జలుబు వదలట్లేదా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!