వైరల్ వీడియో: బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళ.. పోలీసుల రాకతో..

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు నిత్యం సోషల్ మీడియా( Social Media )లో మనం చూస్తూనే ఉన్నాము.

అయితే తాజాగా మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ బ్రిడ్జిపై గడిచిన కొన్ని రోజులుగా ఆత్మహత్యకు సంబంధించిన కేసులు నమోదు అయితున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు.

అచ్చం అలాంటి సంఘటననే తాజాగా మరొకటి చోటు చేసుకుంది.ఒక మహిళ బ్రిడ్జి పై ఆత్మహత్య ప్రయత్నం చేయగా ఆ మహిళను రక్షించెందుకు పోలీస్ అధికారులు ప్రయత్నాలు చేశారు.

ఆ పోలీస్ అధికారులు ధైర్యం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

"""/" / ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.అటల్ సేతు సి లింక్‌( Atal Setu Bridge )లో ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది.

అయితే వెంటనే పోలీస్ అధికారులు అలర్ట్ అయ్యి ఆ మహిళను కాపాడారు.పోలీసుల సమాచారం మేరకు ములుంద్‌ లో నివసిస్తున్న మహిళ ఫ్లై ఓవర్ నుంచి సముద్రంలోకి దూకెందుకు ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. """/" / వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా బ్రిడ్జికి అవతలి వైపు 56 ఏళ్ళు గల మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు సముద్రం వైపుకు దూకుతుండగా అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆమెను పట్టుకున్నాడు.

ఇక అదేసమయానికి అక్కడికి చేరుకున్న నవీ ముంబైకి చెందిన షేవా ట్రాఫిక్ పోలీసులు ( Traffic Police )కూడా వెంటనే అక్కడికి చేరుకొని పోలీస్ అధికారులు అందరూ కలిపి ఆ మహిళలను రక్షించారు.

ఆ మహిళను కాపాడిన ట్రాఫిక్ పోలీసుల పేర్లను లలిత్ శిర్సాత్, కిరణ్ మాత్రే, యశ్ సోనావానే, మయూర్ పాటిల్ అని పోలీసుల అధికారులు తెలిపారు.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?