వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే సైకిల్ పై వచ్చి చోరీ చేసిన దొంగ..!

నేటి రోజులలో దొంగతనాలు ఎక్కువైపోయాయి.చాలా మంది డబ్బులను ఈజీగా పొందడం కోసం దొంగతనాలకు, దోపిడీలకు అలవాటు పడుతున్నారు.

దీనివల్ల సామాన్యులకు చిల్లులు పడుతున్నాయి.సాధారణంగా రాత్రి పూట దొంగతనాలు జరుగుతాయి.

అయితే ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా పట్టపగలే దొంగతనం చేశాడు.దోపిడీ, చోరీ చేసే ముందు ఎవరికంటా పడకూడదని దొంగలు అనుకుంటారు.

అయితే ఇక్కడ మాత్రం ఆ వ్యక్తి దర్జాగా దొంగతనం చేశాడు.సీసీ కెమెరాలకు కూడా భయపడలేదు.

ఓ దొంగ సైకిల్ పై దొంగతనం చేశాడు.సూపర్ మార్కెట్ కు సైకిల్ పై వచ్చాడు.

అందరి ముందూ దొంగతనం చేసి అందరూ చూస్తుండగా దొంగతనం చేసి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అమెరికా దేశంలోని కాలిఫోర్నియా లో ఉన్న శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ సూపర్ మార్కెట్ ఉంది.

వాల్‌ గ్రీన్స్‌ లో ఉన్న ఆ సూపర్ మార్కెట్ లో ఓ వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

ఆ వ్యక్తి వస్తూ వస్తూనే తనతో పాటుగా ఓ నల్లని సంచిని తెచ్చుకున్నాడు.

నల్లగా ఉన్న ఆ సంచిలో తనకు కావాల్సిన వస్తువులను వేసుకున్నాడు.ఇలా దొంగ తనకు కావాల్సిన వస్తువులను తీసుకుంటుంటే అక్కడే ఉన్న సెక్యూరిటీ దానిని చూస్తూ ఉండిపోయాడు.

"""/"/ ఆ తర్వాత ఆ దొంగ తనకు కావాల్సిన వస్తువుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లడానికి చూస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ దొంగను ఆపే ప్రయత్నం చేశాడు.

చివరికి ఆ దొంగ సెక్యూరిటీని దాటుకని వెళ్లిపోయాడు.సూపర్ మార్కెట్ ఉన్నవారు ఆ దొంగను చూసి పట్టుకోవడానికి ప్రయత్నించలేదు.

అయితే ఆ వ్యక్తి దొంగతనం చేయడం చూసి తమ స్మార్ట్ ఫోన్లలో వీడియో తీసుకున్నారు.

ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టారు.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియో: ఇన్‌స్టా రీల్స్‌ విషయంలో గొడవ.. రోడ్డు మీద కొట్టుకున్న యువతులు..