వైరల్: అలా పార్క్ చేయడం వలన పాపం అతని ఎలెక్ట్రిక్ బైక్ కాలిపోయింది!

కరోనా తరువాత ప్రజల జీవన విధానంలో పెను మార్పులే సంభవించాయి.మరీ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు సామాన్యులను బెంబేలెత్తించాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ క్రమంలో గ్యాస్, ఆయిల్ ధరలు కూడా ఆకాశాన్నంటాయి.దాంతో జనాలు పెట్రోల్, డీసెల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలెక్ట్రిక్ వాహనాల( Electric Vehicles ) వైపు మళ్లడం జరిగింది.

ఇక చాలామంది పర్యావరణ కాలుష్యం విషయమై కూడా అలోచించి ఈవిలపై మొగ్గు చూపడం జరిగింది.

కారణం ఏది అయితేనేం.జనాల్లో పరివర్తన అనేది వచ్చిందని చెప్పుకోవాలి.

"""/" / ఈ క్రమంలోనే మనదేశంలో చాలా ఎలెక్ట్రిక్ వాహనాల కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి.

అందులో కొన్ని కంపెనీలు మంచి క్వాలిటీ వాహనాలను ఉత్పత్తి చేస్తుంటే, మరికొన్ని మాత్రం నాసిరకం వాహనాలను ఉత్పత్తి చేస్తూ వాహనదారుల ఆగ్రహానికి గురవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొన్ని కంపెనీలకు సంబందించిన ఈవిలు బగ్గుమనడం మనం కళ్లారా చూసాము.

ఎందుకంటే, సోషల్ మీడియా ఉందిగా.ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా ఆ దృశ్యాలు ఇక్కడ ప్రత్యక్షమౌతూ ఉంటాయి.

తాజాగా అలాంటి సంఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూడవచ్చు.

"""/" / అయితే, ఇక్కడ భగ్గుమన్నది ఆషామాషీ కంపెనీ ఈవి కాదు.అవును, అది టెస్లా కంపెనీ స్కూటర్( Tesla Company Scooter ).

నమ్మలేకపొతున్నారు కదూ.బొమ్మ వెనుక బొరుసు ఉన్నట్టు.

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఈ వాహనం వెనుక కూడా అనేక అనర్ధాలు ఉన్నాయని నిరూపించింది.

ఇక్కడ వీడియోని గమనిస్తే, ఒక డివైడర్ పక్కన ఒక ఎలక్ట్రిక్ వాహనం పార్క్ చేసి ఉండడం గమనించవచ్చు.

ఈ క్రమంలోనే ఆ వాహనం నుంచి పొగలు రావడం మొదట ప్రారంభమైంది.తరువాత ఆ పొగలు కాస్త తగ్గిపోయి మంటలు ప్రారంభమయ్యాయి.

అలా మంటలు పెరిగి అందులోనే ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది.కాలిపోయిన దృష్యాలను వీడియో తీసిన ఒక వ్యక్తి “ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్” అనే ఇన్ స్టా గ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయగా నెటిజనం మన టెస్లా సీఈఓ ఎలోన్ మాస్క్ ని తెగ ఏసుకుంటున్నారు.

కల్కి సినిమా కోసం స్టార్ యాక్టర్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇవే !