Sofa On Bike : భయం లేకుండా ఎలా నిద్రపోతున్నాడో చూడండి.. చూస్తే అవాక్కవుతారు!

కొంత మంది తెలివితేటలు చూస్తూ అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయబ్బా అని అందరూ ఆశ్చర్యపోతారు.

ముఖ్యంగా ఇద్దరు మాత్రమే ఎక్కాల్సిన బైక్‌పై ఏకంగా 8 మంది ప్రయాణించిన వీడియోలు చూశాం.

బైక్‌పై భార్య, పిల్లలతో పాటు భారీగా సామాన్లు పట్టుకెళ్లే వారిని చూడా చూశాం.

అయితే బైక్‌పై ఓ వ్యక్తి విచిత్రమైన రీతిలో ప్రయాణించడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో ఓ వ్యక్తి చాలా రిలాక్స్‌గా కనిపిస్తున్నాడు.అద్బుతమైన రీతిలో బైక్‌కు సోఫా కట్టి( Sofa On Bike )), దానిపై విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈ ఫోటో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.దీని గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

"""/"/ సోషల్ మీడియా( Social Media )లో నిత్యం రకరకాల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి.

అలాంటి వాటిని చూసినప్పుడు అంతా ఆశ్చర్యపోతుంటారు.ఇలాంటి ఐడియాలు మనకు ఎందుకు రావు అని అనుకుంటారు.

అవతలి వారి తెలివితేటలు, వినూత్న శైలి చూసి ముచ్చటపడుతుంటారు.అలాంటి కోవకు చెందిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా బాగా అలసిపోతే సౌకర్యాలు చూసుకోకుండా ఎక్కడైనా పడుకునే వాళ్లు ఉంటారు.అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఫొటో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.

అందులో బైక్‌కు ఓ వ్యక్తి సోఫా కట్టాడు.అనంతరం దానిని మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు.

అయితే బైక్‌కు వెనుక కట్టిన సోఫాలో ఓ వ్యక్తి ప్రశాంతంగా నిద్ర పోతున్నాడు( Sleeping ).

చుట్టూ రణగొణ ధ్వనులు, ఇతర వాహనాల హారన్లు ఇలాంటివి ఏవీ ఆ వ్యక్తి పట్టించుకోలేదు.

అంతేకాకుండా ఏ మాత్రం పట్టుతప్పినా కింద పడి గాయాలు పాలయ్యే ప్రమాదం ఉంది.

అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.అయితే ఇలాంటివి ఏవీ ఆ వ్యక్తి పట్టించుకోలేదు.

తనకు నిద్ర మాత్రమే ముఖ్యం అని భావించాడు.అలా బైక్‌పై కట్టిన సోఫాలోనే కునుకు తీశాడు.

ఈ ఫొటోపై నెటిజన్లు( Netizens Comments ) ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు.ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా తనకు నచ్చింది ఆ వ్యక్తి చేస్తున్నాడని కొందరు ప్రశంసిస్తున్నారు.

ఆ వ్యక్తి తెలివితేటలను మరికొందరు ప్రశంసిస్తున్నారు.అయితే కొంత మంది మాత్రం ఆ వ్యక్తి చర్యలను తప్పుపడుతున్నారు.

పొరపాటున కింద పడితే తగిలే గాయం తీవ్రత చాలా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.

మరికొందరు మాత్రం కింద పడితే అటునుంచి అటే స్వర్గానికి వెళ్లిపోతాడని సెటైర్ వేస్తున్నారు.

ఏదేమైనా ఇలాంటివి చేయకపోవడం మంచిదని, కావాలని ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటివి చేయకూడదని కొందరు సలహా ఇస్తున్నారు.

జపాన్‌: ఈ లిమిటెడ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో లగ్జరీ ఫెసిలిటీస్.. చూస్తే ఫిదా..