అలాంటి వీడియోలు చేయను.. టిక్ టాక్ షాలిని కామెంట్స్ వైరల్..?

టిక్ టాక్ యాప్ బ్యాన్ అయ్యి చాలా నెలలే అయినా ఈ యాప్ ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు పాపులారిటీని సంపాదించుకున్నారన్న సంగతి తెలిసిందే.

అలా టిక్ టాక్ యాప్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఖత్తార్ పాప షాలినీ బుజ్జి ఒకరు.

టిక్ టాక్ లో ఒకవైపు అమాయకంగా ఉంటూ మరోవైపు బూతులు తిడుతూ ఆమె ఫాలోవర్లను పెంచుకున్నారు.

బూతులు తిట్టడం వల్లే ఫేమస్ కావడంతో ఆమె అదే దారిలో నడిచారు.అయితే తాజాగా మాత్రమే ఈమె తాను మారానని ఇకపై బూతులు తిట్టనని చెబుతున్నారు.

తన అసలు పేరు షాలినీ బుజ్జి అని ఆ పేరుతోనే పిలవాలని ఆమె కోరారు.

తనకు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని ఆ అవకాశాల ద్వారా మంచి పేరు వస్తుందని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

టిక్ టాక్ షాలినీ కొన్ని నెలల క్రితం తెగ వైరల్ అయ్యాయి.ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే అవకాశం వచ్చిందని ఈ సాంగ్స్ ద్వారా బిజీ అవుతానని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

"""/"/ ఎక్స్ పోజింగ్ చేసే వీడియోలు ఇకపై చేయనని షాలిని అన్నారు.నేను చాలా లక్కీ అని తనను ఎవరు తిట్టినా అస్సలు పట్టించుకోవద్దని తను చేయబోయే సినిమా దర్శకనిర్మాతలు చెప్పారని ఆమె అన్నారు.

ప్రస్తుతం నటించిన సినిమాకు సంబంధించిన వీడియోను కూడా షాలిని చెప్పారు.అయితే ఆమె ఎవరి డైరెక్షన్ లో నటించబోతుందో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే.

ఇప్పటికే పలువురు టిక్ టాప్ యాప్ ద్వారా గుర్తింపును సంపాదించుకుని సినిమాలు, టీవీ చానెళ్లలో ఆఫర్లను సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే.

మరి షాలిని బుజ్జి కూడా వరుస ఆఫర్లతో సినిమాల్లో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

టిక్ టాక్ బ్యాన్ కాకముందు ఈమెకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ న్యాచురల్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ గ్లో..!