వైరల్: దీనినే మావైపు అతిప్రేమ అంటారు… ఇదేం ఆటరా బాబు!
TeluguStop.com
అమ్మని ప్రేమించని పిల్లలు ఈ భువిపై వుండరు.తండ్రి తన విధుల్లో దూరంగా ఉంటాడు కనుక పిల్లలు తమ తల్లికే ఎక్కువ చేరువ అవుతారు.
ఈ క్రమంలో వారి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది.మరీ ముఖ్యంగా అబ్బాయిలకైతే తల్లే మొదటి ఛాయిస్ అని చెప్పుకోవాలి.
అయితే ప్రస్తుతం తన తల్లిపై తనకు ఉన్న ప్రేమను చూపించి సోషల్ మీడియాలో వైరల్గా మారాడు ఓ చిన్నోడు.
అయితే అది చూడడానికి అతి ప్రేమ మాదిరి ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, ఇదేం ఆటరా బాబు! ఇలాంటి ఆటలు ఎవరు ఆడమన్నారు అని కొందరు అంటున్నారు.
విషయం ఏమంటే, అది స్కూల్ పిల్లల ఆటల పోటీగా కనబడుతోంది.ఇక పోటీ ఏమంటే.
కళ్లకు గంతలు కట్టుకుని దూరం నుంచి వచ్చి తన తల్లికి బన్ తినిపించాలి.
ఎవరైతే తన తల్లికి వేగంగా బన్ తినిపిస్తారో వారే ఇక్కడ విజేత మరి.
అయితే పోటీలో ఎలాగన్నా గెలవాలనుకున్న ఓ చిన్నారి.తన తల్లి నోటిలో తీసుకొచ్చిన బన్ గట్టిగా లొపలికి కుక్కుతాడు.
ఆ క్రమంలో అది బయటకి పడిపోతుందేమో అని అనుమానం రావడంతో సుత్తి తీసుకుని కొట్టినట్లు ఆ బన్ను తన తల్లి నోటిలోకి చేతితో గట్టిగా నెడతాడు.
ఇక చేసేదేమి లేక ఆ తల్లి తన చిన్నారి కోరికను మన్నించి అమాంతం దానిని తన నోటిలో పెట్టుకుంటుంది.
"""/"/
ఇక అలా బన్ తినిపించం పూర్తయిందనుకున్నాక కళ్లకు గంతలు తీసి ఓ నవ్వు నవ్వుతాడు.
ఇంకేముంది, ఆ బుడతడు గెలిచేసాడు.దాంతో ఆ చిన్నారి కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతుంది.
ఆ పోటీల సమయంలో అక్కడ పక్కనే నిలబడి ఉన్న పిల్లలు.ఈ చిన్నారి చేసే పనిని చూసి ఫక్కున నవ్వుకుంటారు.
Tamil.engineer అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.
3 రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 4 లక్షల 62వేల మంది చూడడం విశేషం.
బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతో పాటు ఆమె కూడా ఎలిమినేట్ అవుతారా?