వైరల్: బ్యాంకు క్యాషియర్ మెడపై కత్తి పెట్టి, డబ్బులు ఇవ్వాలని బెదిరించిన దొంగ!
TeluguStop.com
అవును, మీరు విన్నది నూటికి నూరుపాళ్లు నిజం.ఇది మరెక్కడో జరగలేదు.
మన ఆంధ్రాలోనే జరిగినట్టు సమాచారం.అవును, రేణిగుంట బ్యాంకులోనే (Renigunta Bank)ఈ ఘటన జరిగింది.
ఇక్కడ జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ (CCTV Footage)సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు వీడియో తెగ వైరల్ అవుతోంది.
వీడియోని గమనించినట్లయితే.తిరుపతి రూరల్ మండలం రేణిగుంట (Renigunta, Tirupati Rural Mandal)రోడ్డులోని బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు.
క్యాషియర్ దగ్గరకు వెళ్లి మెడపై కత్తి పెట్టి బ్యాగులో డబ్బులు వేయాలని.లేదంటే తీసుకొచ్చిన కత్తితో చంపేస్తానని బెదిరించాడు.
కాగా వీడియో బయటకి రావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.
ఇకపోతే, బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితకబడినట్టు తెలుస్తోంది.వివరాల్లోకి వెళితే.
మంగళవారం సాయంత్రం(Tuesday Evening) సరిగ్గా బ్యాంకు మూసివేసే సమయంలో ఓ యువకుడు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని, బ్యాగ్‌లో కత్తి (Wearing A Kerchief, A Knife In A Bag)పెట్టుకుని బ్యాంక్‌కు వచ్చాడు.
వచ్చి రావడంతోనే క్యాషియర్ పక్కన ఉన్న అకౌంటెంట్ మెడపై కత్తిపెట్టి డబ్బులు బ్యాగ్‌లో వేయాలి, లేదంటే కత్తితో పొడిచి చంపేస్తా అని బెదిరించాడు.
అదే సమయంలో బ్యాంక్‌కు వచ్చిన ఖాతాదారులు ఆ యువకుడిని మాటల్లో దింపి చాకచక్యంగా పట్టుకోవడంతో పెనుప్రమాదం తప్పింది.
"""/" /
ఆ తరువాత ఆ దుండగుడిని ఆ జనాలు బయటకు తీసుకు వచ్చి.
అక్కడే బయట ఉన్న గ్రిల్‌కు కట్టేసి చితకబాదారు.దాంతో ఆ యువకుడు ఇక చేసేదేమిలేక, అసలు నిజం బయటకి కక్కాడు.
తాను రూ.5 లక్షలు అప్పు చేశారని, ఆ బాధ తట్టుకోలేక చోరీకి పాల్పడినట్టు నిందితుడు చెప్పాడు.
దాంతో స్థానికులు ఆ యువకుడిని పోలీసులకు అప్పగించడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా దీనికి సంబందించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోని చూసిన జనాలు జరిగింది మన ఆంధ్రాలోనే అంటూ చాలా ఆశ్చర్యంగా సదరు వీడియోని తిలకిస్తున్నారు.
ఈ మార్పులతో బెల్లీ ఫ్యాట్ మాయం..!