వైరల్: మార్క్‌ల లిస్ట్ చూసే ఇంటిని రెంట్‌కి ఇస్తామంటూ ఓనర్ వింత రూల్..
TeluguStop.com
సాధారణంగా ఇంటిని అద్దెకి( House Renting ) ఇచ్చేటప్పుడు చాలామంది యజమానులు రూల్స్ పెడుతుంటారు.
ఇంట్లో అద్దెకు దిగే వారు మంచివారా లేక చెడ్డవారా అనేది అందరూ చూసుకుంటారు.
మరికొందరు ఇంటి రెంట్ కట్టగల స్థోమత దిగేవారికి ఉందా అనేది చెక్ చేసుకుంటారు.
ఇక కొందరైతే కిరాయికి ఉండేవారి కులం ఏంటి, గోత్రం ఏంటి, వారు శాకాహారమా లేక మాంసాహారమా అనేవి అడిగి తెలుసుకుంటారు.
ఇవన్నీ ఎప్పటినుంచో సాధారణమైపోయాయి.అయితే తాజాగా ఇంటి యజమానులు అద్దెకి దిగే వారి మార్కుల లిస్టు కూడా కావాలని అడుగుతున్నారు.
అసలు అద్దెకి దిగేందుకు మార్కుల లిస్ట్ ఎందుకు? అదేమన్నా జాబ్ హా లేక ఎంట్రెన్స్ ఎగ్జామా అని అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది.
' """/" /
యజమానులు 12వ తరగతి మార్కులను అడుగుతున్నారని బ్రోకర్స్ అద్దెకు దిగేవారికి మెసేజ్‌లు పంపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వాటికి సంబంధించి స్క్రీన్‌షార్ట్స్ సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.
వీటిలోని ఒక స్క్రీన్‌షార్ట్ ప్రకారం 12వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని ఓ వ్యక్తికి తన ఇంటిని రెంట్‌కి ఇవ్వడానికి యజమాని మొండికేసినట్లు తెలిసింది.
90 శాతం మార్కులు వస్తే గానీ యజమాని ఇంటిని అద్దెకి ఇవ్వనని చెప్పినట్లు బ్రోకర్ మెసేజ్ పంపించడం కూడా చూడవచ్చు.
"""/" /
@Kadaipaneeeer అనే ట్విట్టర్ యూజర్ ఇలాంటి వింత రూల్స్ చూసి షాక్ అయ్యాడు.
తర్వాత వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.'మార్క్స్ అనేవి మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయో లేదో తెలియదు కానీ మీకు ఒక ఫ్లాట్ దొరుకుతుందో లేదో మాత్రం నిర్ణయిస్తాయి' అని సదరు ఇంటి యజమానికి ఈ ట్విట్టర్ యూజర్ చురకలాంటించాడు.
ఇలాంటి వింత రూల్స్ బెంగళూరులోని ఒక యజమాని పెట్టినట్లు తెలుస్తోంది.సాధారణంగా బెంగళూరు( Bangalore ), హైదరాబాద్ వంటి నగరాల్లో ఇల్లు అద్దెకి దొరకడం దాదాపు అసాధ్యం.
ఒకవేళ దొరికినా వాళ్ళు పెట్టే రూల్స్ వింటే కళ్ళు తిరుగుతాయి.డబ్బులు బాగా చెల్లించడంతోపాటు అన్ని రూల్స్ పాటించడం తప్ప కిరాయి ఉండేవారికి తప్పడం లేదు.
ఏపీ టెట్ పరీక్షలో 150కు 150 మార్కులు.. అశ్విని సక్సెస్ స్టోరీకి గ్రేట్ అనాల్సిందే!