వైరల్: యువకుడికి షాక్ ఇచ్చిన కోతి..?

మానవ జాతి కోతి నుంచి ఆవిర్భవించిందని చెబుతూ ఉంటారు.మనుషులు చేసే కొన్ని చిలిపి పనులను కోతి చేష్టలతో పోలుస్తూ ఉంటారు.

నిజానికి కోతులు మనుషులను బాగా అనుకరిస్తాయి.మనం వాటితో స్నేహంగా మెసులుకుంటే అవి కూడా స్నేహంగా ఉంటాయి.

వాటి దగ్గర కోతి వేషాలు వేస్తె.అవి ఊరుకుంటాయా? దెబ్బకు దెబ్బ తీస్తుంది.

అలాంటి సంఘటనే జూ లో చోటుచేసుకుంది.ఓ యువకుడు తన సన్నిహితులతో కలిసి 'జూ' కి వెళ్లాడు.

అక్కడ ఒక బోనులో కోతి ఉంది.బోనులో ఉన్న కోతిని ఆ యువకుడు ఆట పట్టించడం మొదలుపెట్టాడు.

అలా చేస్తూ.చేస్తూ కోతిని ఆ యువకుడు కోతి దగ్గరకి వెళ్లి ఏదో ప్రయోగం చేయబోగా.

బోనులో నుండి చేయి బయట పెట్టి అతని జుట్టును అందుకుంది.జుట్టును బలంగా అటూ ఇటూ పీకడం మొదలు పెట్టింది.

అతని జుట్టుకుని వీడకుండా పట్టుకుని తిప్పసాగింది.నొప్పితో ఆ యువకుడు గిలగిలలాడాడు.

చివరకు ఎలాగోలా దాని భారీ నుండి తప్పించుకొని బయటపడ్డాడు.బయటపడిన మరుక్షణం ఆ యువకుడు పరుగుపెట్టాడు.

అయితే, ఈ సన్నివేశాన్నంతా అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది.కామ్ గా ఉన్న దాని దగ్గర తిక్క చేష్టలు చేస్తే ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు అయ్యో పాపం అంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు.ఈ వీడియోకు 24 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

చాలా మంది ఈ వీడియోను భలే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మార్పులు లేని బిగ్‌బాస్.. తెలుగు వచ్చినా ఇంగ్లీష్‌లోనే సంభాషణలు.. వారే ఈసారి ప్లస్..?