వైర‌ల్‌.. వ‌ధువు కోసం దానిమీద వ‌చ్చిన వ‌రుడు..

ఎన్నో సార్లు ఎన్నో ర‌కాల వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నా స‌రే.ఇంకా ఇంకా అదే కార్య‌క్ర‌మానికి సంబంధించిన వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

అదే పెండ్లికి సంబంధించిన వీడియోలు.నిజానికి పెండ్లి అంటే ఓ పెద్ద పండుగ‌.

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో పెండ్లి అనేది అపూర్వ ఘ‌ట్టం.దీన్ని జీవితాంతం గుర్తుంచుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స్పెష‌ల్‌గా ప్లాన్ చేసుకుంటారు.

ఇక ఇప్పుడు చాలా ర‌కాల ఆర్గ‌నైజింగ్ కంపెనీలు వ‌ధూ, వ‌రుల అభిరుచికి త‌గ్గ‌ట్టు వెడ్డింగ్ ప్లాన్లు చేస్తున్నాయి.

ఇందులో చాలా ర‌కాల ప్రోగ్రామ్‌లు కూడా పెడుతున్నాయి.ఇందులో పెండ్లి మంట‌పానికి వ‌ధూ, వ‌రుల‌ను తీసుకెళ్లే కార్య‌క్ర‌మాన్ని చాలా ర‌కాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు.

కొంద‌రేమో ఫ్యాన్సీ కార్లలో వస్తే మ‌రి కొంతమంది మాత్రం రథాలపై, అలాగే గుర్రాల‌పై ఇంకొంద‌రు అయితే డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని కారు బ్యానెట్ మీద‌, అలాగే జేసీబీల మీద కూడా తీసుకెళ్తారు.

ఇలాంటి వీడియోలు ఇప్ప‌టికే మ‌నం చాలా చూస్తున్నాం.సోషల్ మీడియాలో ఇలాంటి వాటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ‌గా వైర‌ల్ అవుతుంటాయి.

ఇప్పుడు కూడా ఓ డిఫ‌రెంట్ వీడియో తార‌స‌ప‌డింది. """/"/ ఈ వీడియో చూస్తే ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఈ వీడియోలో కూడా ఓ వ‌రుడు త‌న‌కు కాబోయే భార్య‌ను మంట‌పానికి తీసుకెళ్లేందుకు చాలా డిఫ‌రెంట్ ప్లాన్ చేశాడు.

అంద‌రిలా చేస్తే కిక్ ఏముంటుంద‌ని అనుకున్నాడో ఏమో గానీ వినూత్నంగా ట్రాక్టర్‌పై ఆ వ‌రుడు వచ్చాడు.

దాంతో అతడి ఎంట్రీని చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారు.ఆ ట్రాక్ట‌ర్‌ను పూర్తిగా పూలు, బెలూన్లతో డిజైన్ చేసి మ‌రీ రాయ‌ల్‌గా వ‌చ్చి తీసుకెళ్లాడు.

అది చూసిన బంధువులందరూ ఎంతో హ్యాపీ అయ్యారు.వ్య‌వ‌సాయంలో ఉప‌యోగ‌ప‌డే ట్రాక్ట‌ర్ ను ఎంచుకున్నందుకు అంద‌రూ ఆనంద‌ప‌డుతున్నారు.

Dosa Crop : వేసవికాలంలో దోస పంట సాగు చేస్తే శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువ..!