వైరల్: బామ్మకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మనవళ్లు.. బామ్మ ఆనందం చూడండి!

సోషల్ మీడియా( Social Media )లో ఒక్కోసారి వైరల్ అయిన వీడియోలు మనసుని హత్తుకుంటాయి.

అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జీవితంలో ఒక్కసారైనా విదేశాలకు వెళ్లాలని ఎవరు మాత్రం అనుకోరు.

ప్రపంచాన్ని జీవితంలో చుట్టి రావాలని ఎవరికైనా ఉంటుంది.అయితే ఈ కోరిక ఎంతమందికి నెరవేరుతుంది అనేదానికి సమాధానం మాత్రం ప్రస్నార్ధకమే.

డబ్బు లేని కారణంగా ఇలాంటి కలలు కన్న వారి కలలు కలగానే మిగిలిపోతాయి.

అయితే ఆ బామ్మ కల మనవళ్ల రూపంలో నెరవేరింది.దాంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

"""/" / అవును, ఇక్కడ ఇద్దరు యువకులు ఎవరూ చేయని ఓ పనిని చేశారు.

సొంత వూళ్ళల్లోనే బరువుగా భావించే ఇలాంటి నానమ్మలు ఎంతోమంది వుంటారు.వారు అలా అనుకోలేదు.

తమతో పాటు విదేశీ పర్యటనకు విమానంలో ఆమెను తీసుకెళ్లారు.పారిస్( Paris ), ఇటలీ దేశాలు చూపించి వారి నానమ్మ ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నారు ఆ ఇద్దరు సోదరులు.

అనుకున్నదే తడవుగా టిక్కెట్లు బుక్ చేసారు.కట్ చేస్తే, నానమ్మ తమతో పాటు ప్యారిస్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోందని ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేశారు.

"""/" / దానికి సంబందించిన వీడియో తమ ఇన్‌స్టాగ్రామ్( Instagram ) హ్యాండిల్‌లో షేర్‌ చేయగా నెటిజన్లు వారిని ఆకాశానికెత్తేస్తున్నారు.

కాగా వారి నానమ్మ తన జీవితంలో ఇవి మరుపురాని మధుర క్షణాలుగా ఆ వీడియోలో చెప్పింది.

వైరల్ అవుతున్న వీడియోలో వారు పారిస్‌లోని తమ హోటల్ గది నుండి దూరంగా చూస్తున్న అమ్మమ్మ ఆనందాన్ని రికార్డు చేసి చూపించారు.

అంతేకాదు ఆ వీడియోలో పారిస్ వీధుల్లో తిరుగుతున్నట్టు కనబడుతోంది.అందరూ కలిసి ఈఫిల్ టవర్ దగ్గర పోజులివ్వడం కూడా అందులో చూడవచ్చు.

ఈ ప్రోటీన్ మాస్క్ తో మీ కురులు అవుతాయి డబుల్..!