వైర‌ల్‌.. పెండ్లి కూతురు గెట‌ప్ లోనే ఎగ్జామ్ హాల్‌కు వ‌చ్చిన అమ్మాయి..

ప్ర‌తి అమ్మాయి జీవితంలో రెండు విష‌యాలు చాలా ముఖ్యం.అందులో ఒక‌టి చ‌దువు అయితే రెండోది పెండ్లి.

ఈ రెండు జీవితాలనీ  మ‌లుపు తిప్పే అంశాలు.దీన్నీ వ‌దులుకోలేదు.

అయితే ఈ న‌డుమ చాలామంది చిన్న వ‌య‌సులోనే పెండ్లిలు చేసుకుని చ‌దువును ఆపేస్తున్న ఘ‌ట‌న‌లు మ‌నం అనేకం చూస్తున్నాం.

కానీ అదే స‌మ‌యంలో చాలామంది పెద్ద‌ల‌ను ఎదురించి మ‌రీ తాను అనుకున్న చ‌దువును పూర్తి చేస్తున్న వారు కూడా అనేకంగా  ఉన్నారు.

ఇలాంటి వారు రాబోయే త‌రాల‌కు ఆద‌ర్శం.కానీ వారు అలా ఎదురించే స‌మ‌యంలో కొన్ని స‌మ‌స్య‌లు కూడా ఫేస్ చేయాల్సి వ‌స్తుంది.

కానీ అనుకున్న‌ది సాధించే క్ర‌మంలో వారు ప‌డే ఎత్తు ప‌ల్లాలు కూడా ఇబ్బందిని పెడతాయి.

కానీ ల‌క్ష్యాల‌ను సాధించి చూపిస్తే క‌న్న త‌ల్లి దండ్రుల‌కే చాలా మంచి పేరు వ‌స్తుంద‌ని కూడా చెప్పొచ్చు.

కానీ కొన్ని ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాలు కావ‌చ్చు లేదంటే ఇత‌ర కార‌ణాల‌తో అమ్మాయిల‌కు త‌ల్లిదండ్రులు తొంద‌ర‌గానే పెండ్లి చేస్తున్నారు.

అద్భుతంగా చ‌దివే అమ్మాయిల‌కు కూడా త్వ‌ర‌గానే వివాహం జ‌రిపిస్తున్నారు.అయితే కొంద‌రు పెండ్లి స‌మ‌యంలో కూడా త‌మ‌కు ఎంతో ఇష్ట‌మైన చ‌దువుల విష‌యంలో ఎగ్జామ్ రాసేందుకు వ‌స్తున్నారు.

"""/" / ఇప్పుడు కూడా ఇలాంటి ఓ అమ్మాయి గురించే తెలుసుకోబోతున్నాం.గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ ప్రాంతంలో నివ‌సించే శివంగి బగ్థారియాకు చిన్న‌ప్ప‌టి నుంచే చ‌దువ‌లు అంటే చాలా ఇష్టం.

అయితే ఆమెకు ఇంట్లో వారు పెండ్లి నిశ్చ‌యించారు.అయితే ఆమె పెండ్లి రోజునే ఎగ్జామ్ ఉండ‌టంతో ఆమె పెండ్లి కూతురు బ‌ట్ట‌ల్లోనే ఎగ్జామ్ రాసేందుకు వ‌చ్చింది.

మ‌రి కాసేప‌ట్లో పెండ్లి పెట్టుకుని మ‌రీ ఎగ్జామ్ హాల్ కు రావ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

కాగా ఆమెను చూసి అంద‌రూ అభినందించారు.ఇలాంటి వారు ఎంద‌రికో స్ఫూర్తి అంటూ మెచ్చుకుంటున్నారు.

త్రివిక్రమ్ స్వయం వరం సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?