వైరల్: నాకు వద్దుబాబోయ్ అంటూ పరుగెత్తిన వరుడు.. నిన్ను వదలనురా అంటూ నవ వధువు?

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతూ వుంటారు.అవును.

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.అందుకే తన పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.

ఇటీవలి కాలంలో తమ తాహతుకు మించి పెళ్లి చేసుకుంటున్న వారు సంఖ్య పెరిగిపోతూ వుంది.

కాగా ఇలాంటి తరహా పెళ్లి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో అనునిత్యం వైరల్ గా మారిపోతున్నాయి.

ఈ క్రమంలోనే ఇక్కడ పెళ్లికి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.

అచ్చంగా సినిమాల్లోని జరిగిన మాదిరి జరిగిన ఈ సన్నివేశాన్ని చూస్తే మీకు నవ్వాగదు.

ఈ ఘటన బీహార్లోని నవాడ ప్రాంతంలో జరిగింది.భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడికి సూచించగా.

నాకు పెళ్లి వద్దు.ఈ పిల్లా వద్దు బాబోయ్.

అంటూ యువకుడు నడిరోడ్డు మీద పరుగులు పెట్టాడు.అదే సమయంలో నాకు నువ్వే కావాలి అంటూ వధువు రోడ్డు మీద అతని వెంట పరుగులు పెట్టిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా చెక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఇద్దరు యువతీ యువకులకు 3 నెలల క్రితమే వివాహం నిశ్చయించారు.

50 వేల రూపాయల కట్నం ఒక బైక్ కూడా ఇచ్చారు.అయితే వివాహ ముహూర్తాన్ని సదరు యువకుడు దాటవేస్తూ వస్తున్నాడు.

ఇటీవలే ఇక వధువు తరపు బంధువులు యువకుడి ఇంటికి వెళ్లగా పరారయ్యేందుకు ప్రయత్నించాడు.

దీంతో వధువుకి చిర్రెత్తింది.నన్నెలా పెళ్లి చేసుకోవో? నేను చూస్తా అంటూ.

అతని వెంట పరుగులు పెట్టింది.చివరికి పోలీస్ స్టేషన్ వరకు ఈ వ్యవహారం చేరడంతో వేరేదారిలేక పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు పాపం ఆ వరుడు.

బిజినెస్ మాన్ గా మారిన కొరటాల..దేవర కోసం అంత రిస్క్ చేస్తున్నారా..?