వైరల్ : కరోనా సోకడంతో ఆ అబ్బాయి చేసిన ఆలోచన సూపర్..!

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగా వైద్యం దొరక్కపోవడం.అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు డబ్బులు పోసిన కొన్నిసార్లు చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల నడుమ ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు.

ఇలాంటి సమయంలో మనుషులకు వారి ప్రాణాలు కాపాడుకోవడానికి సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు.ఇలా కొన్ని ఆలోచనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఒక్కసారి కరోనా మహమ్మారి శరీరంలో ప్రవేశించిన అంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

అయితే కరోనా వైరస్ రాకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు కొందరు పాటిస్తుంటే అందులో భాగంగా వారు తమ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇలా తాజాగా ఓ వ్యక్తి కి కరోనా వైరస్ సోకడంతో ఆ వైరస్ తన ఇంట్లోనే వ్యక్తులకు సోకకూడదని ఏకంగా స్వతహాగా హోమ్ ఐసోలేషన్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

అది ఎలా అంటే.వారు నివసిస్తున్న ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో అతడు ఇంట్లో ఉండడానికి వీలు లేకుండా పోయింది.

దాంతో అతను ఇంట్లో వాళ్లకు కరోనా వైరస్ సోకకూడదని భావించడంతో అతడు ఓ విచిత్రమైన ఆలోచన చేసి తనకు సపరేట్గా హోమ్ క్వారంటైన్ ఏర్పాటు చేసుకున్నాడు.

అది ఎలా అంటే.చెట్టు కొమ్మలకు మధ్య ఓ మంచాన్ని కట్టిపడేసి అక్కడే తినడం, నీరు తాగడం, పడుకోవడం లాంటివి కొనసాగిస్తున్నాడు.

ఇలా గత తొమ్మిది రోజుల నుంచి ఆ వ్యక్తి ఇలానే చేస్తు ఉండటంతో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం నంది కొండ గ్రామంలో వెలుగు చూసింది.

గ్రామంలో ఉన్న రామావత్ శివ అనే యువకుడు కరోనా బారిన పడటంతో ఈ వెరైటీ ఆలోచన చేశాడు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగా కోడలు బాటలోనే నటి మెహ్రీన్. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేలాలేదే?