వైరల్: పిల్ల కొంచెం.. ఆర్చెరీ ఘనం..!

పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది.కానీ, అది సమయం వచ్చినప్పుడు మాత్రమే బయట ప్రపంచానికి తెలుస్తుంది.

టాలెంట్ ఉన్నా గాని కొంతమంది ప్రోత్సాహం లేక అలానే వెనుకబడి పోతున్నారు.వాళ్లలో ప్రతిభ ఉన్నాగాని ప్రపంచానికి తెలియటం లేదు.

అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం మీరు వింటే అవాక్ అవుతారు.ఓ ఐదు సంవత్సరాల చిన్న పాప ఎంతో గొప్ప సాహసం చేసి రికార్డు నెలకొలిపింది.

పెద్ద వాళ్లు సైతం చేయలేని ఆ సాహసాన్ని ఆ పాప ఎంతో సునాయాసంగా చేసి అందరి చేత ప్రశంసలు పొందింది.

ఆ పాప చేసిన సాహసం గురించి మీరు తెలుసుకుంటే మీరు కూడా ఆ పాపని మెచ్చుకోకుండా ఉండరు.

పిట్ట కొంచెం.కూత ఘనం అని మన పెద్దవాళ్ళు ఉరికనే అనలేదు.

అలా అనడానికి ఈ పాప ఒక ఉదాహరణ.అసలు వివరాలలోకి వెళితే.

చెన్నైకి చెందిన ఐదేళ్ల బాలిక అయిన సంజన ఇప్పుడు ఇండియాలో సెన్సేషన్ క్రెయేట్ చేసింది.

జస్ట్ 13 నిమిషాల 15 సెకండ్లలో అక్షరాలా 111 బాణాల్ని సందించింది.అది కూడా మాములుగా కాదు తల కిందకూ, కాళ్లు పైకి పెట్టి రివర్సులో వేలాడుతూ అన్నీ బాణాలని సంధించింది.

బాణా విద్యలో అర్జునిడికి సాటి ఎవరు లేరు కదా.! అలాంటింది ఈ పాప చేసిన సాహసం చూస్తే అందరికి అర్జునుడు గుర్తుకు వస్తాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ఈ చిన్నారి ఈ ప్రయత్నం చేసింది.భారత ఆర్చరీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (AAI) సెక్రెటరీ జనరల్ అయిన ప్రమోద్ చందూర్కర్ ఈ ఈవెంట్‌ కు చీఫ్ గెస్టుగా వచ్చారు.

ఆయనతో పాటూ పలువురు ప్రముఖులు, ఢిల్లీ ఆర్చరీ అసోసియేష్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవ కూడా హాజరయ్యారు.

అలాగే AAI జడ్జెస్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జోరిస్ ఈ ఈవెంట్‌ని ఆన్లైన్‌ లో కూడా చూశారు.

అలాగే కాంటినెంటల్ జడ్జ్ ఆఫ్ వరల్డ్ ఆర్చరీ అధ్యక్షతన ఏర్పడిన జడ్జీల ప్యానెల్ ఈ ఈవెంట్‌ను పర్యవేక్షించింది.

అసలు సాధారణంగా ఏ ప్రపంచ పోటీలోనైనా, నేషనల్ పోటీలోనైనా గాని ఎంత ట్రైనింగ్ పొందిన ఆర్చర్లు కూడా 6 బాణాల్ని 4 నిమిషాల్లో సంధిస్తారు.

అంటే 20 నిమిషాలకు 30 బాణాల కింద లెక్క అని సంజనకు ట్రైనింగ్ ఇచ్చిన సిహాన్ హుస్సైనీ తెలిపారు.

"""/"/ కానీ, ఈ పాప ఆ రికార్డ్ ను సైతం తిరగరాసింది.తన గారాల పట్టి సాధించిన ఈ ఘనత చూసి తండ్రి ప్రేమ్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఇకపై ఏటా ప్రతీ ఇండిపెండెంట్స్ డే నాడు తన కూతురు ఓ కొత్త రికార్డ్ నెలకొల్పుతుందన్నారు.

పదేళ్లు వచ్చే వరకూ అలా చేయిస్తానన్నారు.పదేళ్ల తర్వాత ఆమెను 2032 ఒలింపిక్స్‌కి ట్రైనింగ్ ఇప్పిస్తానన్నారు.

అలా నా పాపని దేశం గర్వపడేలా చేయిస్తానన్నారు.ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దానితో పలువురు నెటిజన్లు సంజనా పై ప్రశంసల జల్లు కురుస్తోంది.ఈ చిన్నారి ద్వారా ఇండయన్ ఆర్చరీ ప్రపంచంలోనే టాప్‌ కి వెళ్తుందని మరో యూజర్ ఆశించారు.

ఈ పాప ఈ వయసులోనే ఇంత చేస్తే పెద్దయ్యాక మరెంత చేస్తుందో కదా.

మంగళగిరిలో లోకేష్ పరిస్థితేంటి ?