వైరల్: సముద్ర తీరాన వింత పదార్థం.. ఎక్కడంటే..?
TeluguStop.com
సాధారణంగా చాలా మంది వింత వస్తువులను, పదార్థాలను చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటారు.అంతేకాదు ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు.
ఇప్పుడు కూడా ఓ వింత జీవి గురించి చర్చ కొనసాగుతోంది.ఈ విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి.
ముఖ్యంగా సముద్రాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.సముద్ర అడుగు భాగంలో ఇప్పటి వరకూ గుర్తించని, ఏముందో కనిపెట్టని జీవులూ ఉంటాయి.
అచ్చం అలాంటి ఓ వింత పదార్థాన్ని నార్త్ కరోలినా తీరంలో నేషనల్ పార్క్ అధికారులు కనుగొన్నారు.
ఇది చూడటానికి గజిబిజీగా, చాలా పెద్దగా ఉంది.కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ ఫేస్బుక్లో షేర్ చేసిన దీనికి కాళ్లు, చేతులు, తల వంటి భాగాలు కూడా లేవు.
‘అంతుచిక్కని పదార్థం’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో ఉన్న జీవి కొన్ని నెలల క్రితమే సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చింది.
అగ్రరాజ్యం అమెరికాలో వింత పదార్థం దర్శనమిచ్చింది.దీన్ని చూసిన కొందరు స్థానికులు మొదట ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు.ఇక్కడి కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ తీరానికి ఈ వింత పదార్థం కొట్టుకొచ్చింది.
అదేంటో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు.దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీన్ని సోషల్ మీడియాలో పంచుకున్న నేషనల్ పార్క్ సర్వీసు విభాగం ఇదేంటో గుర్తించాలంటూ నెటిజన్లను కోరింది.
ఈ పదార్థం ఏంటో తాము గుర్తించలేకపోయామని నేషనల్ పార్క్ సర్వీసు అధికారులు తెలిపారు.
ఈ సంస్థ మాత్రం దీన్ని స్వ్కిడ్ యొక్క అండపు తిత్తి అని భావిస్తోంది.
ఇలాంటి వింత జీవులు మనుషుల కంట పడటం ఈ మధ్య సాధారణమైపోయింది.అందుకే చాలా మంది కొత్త జీవి కనిపిస్తే చాలు ఉండలేరు.
అది ఏందో కనిపెట్టేంత వరకూ దానిపై పరిశోధనలు చేస్తూనే ఉంటారు.ఈ జీవిని కూడా త్వరలోనే కనుగొనే అవకాశముంది.
బాలయ్య బోయపాటి కాంబో లో వస్తున్న సినిమా కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?