వైరల్… ఆరు కాళ్ళు, రెండు తోకలతో వింత కుక్క పిల్ల
TeluguStop.com
ప్రపంచంలో ఎన్నో రకాల వింతలు జరుగుతూనే ఉంటాయి.ఈ వింతలు జరగడానికి వినాశనం కాబోతున్నదనే సంకేతాన్ని ఇస్తోందని కొంతమంది కరోనా సమయంలో కూడా ఇటువంటి వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం కొన్ని జంతువులకు వింత వింత జననాలు సంభవిస్తూనే ఉన్నాయి.
సాధారణంగా కుక్క పిల్లలు జన్మిస్తే ఒక సాధారణ కుక్క ఎలా ఉంటుందో అలా ఉండాలి.
కాని మీరు చూస్తున్న కుక్క పిల్ల ఆరు కాళ్లు, రెండు తోకలతో జన్మించడంతో ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికాలోని ఓక్లహోమాలో నీల్ వెటర్నరీ ఆసుపత్రిలో ఈ వింత కుక్క పిల్లలు జన్మించాయి.
సాధారణంగా ఇటువంటి కుక్క పిల్లలు ఎక్కువ రోజులు బ్రతకవు.కాని ఇవి ఆరోగ్యంగా ఉండడంతో పెద్ద అయ్యాక సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్ లు తెలుపుతున్నారు.
గర్భాశయంలో పిండం వేరుగా కాకపోయినప్పుడు ఇలా సంభవిస్తాయని డాక్టర్ లు తెలుపుతున్నారు.ఏది ఏమైనా ఈ వింత కుక్క పిల్ల చక్కగా ఆడుకుంటోంది.
ఈ వింత కుక్క పిల్ల ఇప్పుడు ఇంటర్నెట్ సెలెబ్రెటీగా మారిపోయింది.
విడాకులు అయినా తనను వదలను.. ప్రభుదేవా మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు వైరల్!