వైరల్: అడ్రస్ పేరుతో అమ్మాయితో వింత ప్రవర్తన.. చివరికి..?

నేటి రోజులలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి.ఎక్కడ చూసినా వారిపై అఘాయిత్యాల పర్వం మనకు కనిపిస్తోంది.

ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ మహిళలకు వేధింపులనేవి ఆగడం లేదు.

నేటి సమాజంలో పోకిరిల ఆగడాలు ఎక్కువవుతున్నాయి.ప్రతిరోజూ ఎక్కడోచోట పోకిరి గాళ్ళతో అమ్మాయిలు, మహిళలు ఎన్నో రకాలుగా అవస్థలనేవి పడుతున్నారు.

ఇంకా చెప్పాలంటే మెట్రో నగరాలలో మహిళలపై వేధింపులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి.ఇటువంటి సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి.

అయితే కొన్నిచోట్ల మహిళలు ఆకతాయిలను, వేధింపులకు గురి చేసేవారిని ఎదుర్కొని పోరాడుతున్నారు.తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఓ పోకిరీ వెదవకు ఓ మహిళ బుద్ధిచెప్పింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అస్సాం, గువహటికి చెందిన భావన కశ్యప్‌ జులై 30వ తేదిన రుక్మిణి నగర్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రాజ్ కుమార్ అనే వ్యక్తి స్కూటీపై వచ్చాడు.

ఆ వ్యక్తి అటుగా వెళుతున్నట్టు నటిస్తూ ఆమె దగ్గరికి చేరాడు.ఆ తర్వాత భావనను రాజ్ కుమార్ ఏదో అడ్రస్ అడిగాడు.

అయితే అతడు చెప్పింది ఆమెకు వినపడలేదు.దీంతో ఆ యువకుడు ఆమెకు ఇంకాస్త దగ్గరకు వచ్చిన రాజ్ కుమార్ మళ్ళీ అడ్రస్ ఎక్కడుందో చెప్పాలంటూ అడిగాడు.

దానికి ఆ అమ్మాయి భావన ఆ అడ్రస్ తెలియదని అనడంతో అదే అదనుగా రాజ్ కుమార్ ఆమెను అసభ్యకరంగా తాకడం మొదలెట్టాడు.

దీంతో భావన షాక్ అయ్యింది. """/"/ ఆ వ్యక్తిని ఏదో ఒకటి అనే లోపే అతడు అక్కడి నుంచి పారిపోయేందుకు ట్రై చేశాడు.

కానీ ఆ యువతి అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది.చివరికి ఆ వ్యక్తి స్కూటీ అక్కడే పక్కనే ఉన్నటువంటి ఓ కాలువలో ఇరుక్కుపోయింది.

ఆ తర్వాత భావన ఆ వ్యక్తిని ఓ ఆట ఆడేసుకుంది.ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.