వైరల్: భారీ సైజ్ గుడ్లు మింగేసినా పాము.. చివరకి..?!

సాధారణంగా జనారణ్యంలో తిరిగే మనుషులకు ఒక్కసారిగా పాములను చూస్తే భయం వేయడం సహజం.

ఎందుకంటే పాములు మనుషులకు హాని చేస్తాయి.అలాగే పాము విషం ఎంతో ప్రాణాంతకరమైనది.

అందుకే పాము కాటేస్తే ఎవరయినా సరే ప్రాణాలతో మిగిలరు.అందుకే పాములను చూస్తే జనాలు భయంతో వణికిపోతారు.

ఒకవేళ పాము మనుషులు నివసించే చోట కనిపించినాగాని దాన్ని వెతికి పట్టుకుని మరి చంపేస్తారు.

కానీ ఈ ప్రాంతంలో మాత్రం అందుకు భిన్నంగా అక్కడ ప్రజలు పాముని చంపలేదు సరికదా భయపడకుండా ఆ పామును చూస్తూ ఉండిపోయారు.

అలాగే ఆ పాము పడే అవస్థలు చూసి అక్కడి జనాలు సైతం అయ్యో పాపం అన్నారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాము వీడియో బాగా వైరల్ అయింది.ఇంతకీ అసలు ఆ పామును చంపకుండా ఎందుకు వదిలేసారు.

ఎందుకు దాని అవస్థ చూసి ప్రజలు విచారించారో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాములు సాధరణంగా చిన్నా చితక జీవులను తిని కడుపు నింపుకుంటాయి.ఏ ఆహారం అయినాగానీ పాములు మింగేస్తాయి అనే విషయం మన అందరికి తెలిసిందే.

అయితే వీడియోలో కనిపించే పాము మాత్రం ఆహారం అధికమవటంతో ఆ ఆహారాన్ని బయటకు తీసేందుకు పాము పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు.

కడుపులో ఆహారం ఎక్కువ అయిపోవడంతో వాటిని మళ్లీ బయటకు విసర్జించింది.అయితే ఆ ఆహారాన్ని బయటకు కక్కే క్రమంలో పాము గిలగిలా కొట్టుకుంది.

దాని అవస్థలు చూసిన జనం అయ్యో పాపం అని అనుకున్నారు. """/"/ ఇంతకీ అసలు పాము ఏం మింగిందంటే భారీ సైజ్‌లో ఉన్న రెండు గుడ్లను మింగేసింది.

అయితే మింగేటప్పుడు వాటిని సులభంగా మింగింది.కానీ, తరువాత మాత్రం అవి పాము పొట్టలో మధ్యలోనే ఇరుక్కుపోయాయి.

ఆ గుడ్లు భారీ పరిణామంలో ఉండడం చేత పాము శరీరంలో ఇబ్బందిని కలిగించాయి.

పాము ఆ గుడ్లను పూర్తిగా మింగలేకపోయింది.ఫలితంగా ఆ పాము అటు ఇటు కదలలేకపోయింది.

ఈ క్రమంలోనే సగం వరకు మింగిన ఆ గుడ్లను పాము బయటకు తీసేందుకు నానా తంటాలు పడింది.

గుడ్లను బయటకు తీసే క్రమంలో పాము నేలపై గిరగిరా తిరుగుతూ, గిలగిల కొట్టుకుంటూ ఎట్టకేలకు ఆ గుడ్లను బయటకు విసర్జించింది.

విసర్జించిన ఆ గుడ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి.ఈ పాము అవస్థను అక్కడ ఉన్న కొందరు వీడియో తీశారు.

ఈ వీడియోను అడ్లే అనే మహిళ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.

కాంగ్రెస్ మంత్రి జూపల్లిపై ఈసీకి ఫిర్యాదు